సగం మ్యూజిక్... సగం రెమ్యూనరేషన్ !

‘ప్రేమమ్’, ‘నిన్ను కోరి’, ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తెలుగులో కూడా పాపులర్ అయ్యాడు. ‘నిన్ను కోరి’ సినిమా కి మంచి సంగీతాన్ని అందించడం తో… దర్శకుడు శివ నిర్వాణ ‘మజిలీ’ సినిమాకు కూడా గోపి సుందర్ నే తీసుకున్నాడు. కానీ అతనికి చేదు అనుభవం ఎదురైంది. సినిమా మొదలయ్యే ముందే అడ్వాన్స్ గా మొత్తం రెమ్యునరేషన్ ని గోపి సుందరికి ఇచ్చేసారు నిర్మాతలు. […]

Advertisement
Update:2019-04-20 04:33 IST

‘ప్రేమమ్’, ‘నిన్ను కోరి’, ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తెలుగులో కూడా పాపులర్ అయ్యాడు.

‘నిన్ను కోరి’ సినిమా కి మంచి సంగీతాన్ని అందించడం తో… దర్శకుడు శివ నిర్వాణ ‘మజిలీ’ సినిమాకు కూడా గోపి సుందర్ నే తీసుకున్నాడు. కానీ అతనికి చేదు అనుభవం ఎదురైంది. సినిమా మొదలయ్యే ముందే అడ్వాన్స్ గా మొత్తం రెమ్యునరేషన్ ని గోపి సుందరికి ఇచ్చేసారు నిర్మాతలు.

కానీ గోపి సుందర్ మాత్రం అనుకున్న సమయానికి నేపథ్య సంగీతాన్ని ఇవ్వలేకపోయాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో దర్శక నిర్మాతలు తమన్ వద్ద సంగీతం తీసుకున్నారు.

ఆఖరి నిమిషంలో అడిగినప్పటికీ తమన్ ఈ సినిమాకి మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. ఒకవేళ తమన్ ఈ సినిమాని అంగీకరించకపోతే ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల అయ్యేది కాదు.

కొంత సంగీతం తమన్ అందించడంతో గోపి సుందర్ ని కొంత రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశారు దర్శక నిర్మాతలు. లేకపోతే నిర్మాతల మండలి లో ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో ఇక చేసేది లేక గోపి సుందర్ కొంత రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చాడట. అప్పుడు దర్శకనిర్మాతలు కూడా కాంప్రమైజ్ అయ్యారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News