అనుపమను రాక్షసుడైనా ఆదుకుంటాడా?

కొందరి కెరీర్ అంతే. కెరటంలో ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ వచ్చేస్తుంది. అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. అ..ఆ, ప్రేమమ్, శతమానంభవతి లాంటి సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు ట్రాక్ తప్పింది. ఓ హిట్ కోసం పరితపిస్తోంది. రీసెంట్ గా అన్నీ ఫ్లాపులే ఇచ్చింది అనుపమ. నాని సరనస కృష్ణార్జున యుద్ధం చేస్తే […]

Advertisement
Update:2019-04-11 11:40 IST

కొందరి కెరీర్ అంతే. కెరటంలో ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ వచ్చేస్తుంది. అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. అ..ఆ, ప్రేమమ్, శతమానంభవతి లాంటి సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు ట్రాక్ తప్పింది. ఓ హిట్ కోసం పరితపిస్తోంది.

రీసెంట్ గా అన్నీ ఫ్లాపులే ఇచ్చింది అనుపమ. నాని సరనస కృష్ణార్జున యుద్ధం చేస్తే అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తేజూతో కలిసి ఐ లవ్ యూ అన్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమధ్య చేసిన హలో గురు ప్రేమకోసమే సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా వరుసగా ఫ్లాపులు వెక్కిరిస్తున్న వేళ, అనుపమ నటించిన మరో సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

ఈసారి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో కలిసి థియేటర్లలోకి వస్తోంది అనుపమ. రాక్షసుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపమ.. తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. ఇది హిట్ అయితే.. ఈ ఏడాది బోణీ కొట్టినట్టవుతుంది. లేదంటే అంతే సంగతులు. మరోవైపు ఈమెకు టాలీవుడ్ నుంచి మెల్లగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. సో.. ఇప్పుడు అనుపమ కెరీర్ మొత్తం రాక్షసుడి చేతిలో ఉందన్నమాట.

Tags:    
Advertisement

Similar News