కళ్యాణి మాలిక్ పై ఉప్పర కుల సంఘం ఫైర్.... పోలీసులకు ఫిర్యాదు

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అందరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు. ఈ సినిమా అనూహ్య పరిణామాల నడుమ విడుదల కావడమే కాకుండా అందరినీ మెప్పించింది కూడా. ఆంద్ర ప్రదేశ్ మినహా ప్రపంచం మొత్తం ఈ సినిమా విడుదల అయ్యింది. విడుదల తర్వాత వచ్చిన అనేక సమీక్షల్లో ఈ సినిమా కి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ పనితనం ఒక పెద్ద అసెట్ అని అందరూ కొనియాడారు. అయితే ఈ సంగీత దర్శకుడి మీద […]

Advertisement
Update:2019-04-03 06:13 IST

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అందరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు. ఈ సినిమా అనూహ్య పరిణామాల నడుమ విడుదల కావడమే కాకుండా అందరినీ మెప్పించింది కూడా.

ఆంద్ర ప్రదేశ్ మినహా ప్రపంచం మొత్తం ఈ సినిమా విడుదల అయ్యింది. విడుదల తర్వాత వచ్చిన అనేక సమీక్షల్లో ఈ సినిమా కి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ పనితనం ఒక పెద్ద అసెట్ అని అందరూ కొనియాడారు.

అయితే ఈ సంగీత దర్శకుడి మీద కడప జిల్లా లో ఉప్పర కుల సంఘ నాయకులు పోలీస్ కేసు పెట్టారు. వారు చెప్పిన దాని ప్రకారం కల్యాణి మాలిక్ వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా కించపరుస్తూ మాట్లాడారట.

మంగళవారం ఆ సంఘం కడప జిల్లా అధ్యక్షుడు మాదాసు మురళి, సంఘం నాయకులతో కలిసి ప్రొద్దుటూరు టూటౌన్‌ ఎస్‌ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డికి ఈ ఫిర్యాదు చేశారు. సినిమా విడుదల తర్వాత టీవీ లో ఒక ఛానెల్ లో వచ్చిన సమీక్ష సందర్భం గా మాట్లాడుతూ కళ్యాణి మాలిక్ ‘ఉప్పరసోదీ’, ‘ఉప్పర పనికిమాలిన సోదీ’ అంటూ మాట్లాడారని, అవి వారి కులాన్ని కించపరిచే లాగా ఉన్నాయని వారు తమ ఫిర్యాదు లో చెప్పారు.

పోలీసులు తమకి ఫిర్యాదు అందింది అని మీడియా కి తెలిపారు. తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును ముందుకు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తాం అని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News