పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న హీరోయిన్ !

బ్రిటిష్ భామ అయినప్పటికీ, దక్షణాదిలో భారీ సినిమాల్లో నటించింది అమీ జాక్సన్. ఈమధ్యనే రజినీకాంత్ నటించిన ‘2.O’ సినిమాలో కనిపించిన ఈమె గత కొంత కాలంగా జార్జ్ పనయోటో అనే లండన్ వ్యాపారితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నారు అని అనుకునే లోపే అమీ జాక్సన్ ఒక సంచలన వార్త ప్రకటించింది. తాజాగా అమీ జాక్సన్ సోషల్ మీడియా ద్వారా తాను […]

Advertisement
Update:2019-04-01 02:24 IST

బ్రిటిష్ భామ అయినప్పటికీ, దక్షణాదిలో భారీ సినిమాల్లో నటించింది అమీ జాక్సన్. ఈమధ్యనే రజినీకాంత్ నటించిన ‘2.O’ సినిమాలో కనిపించిన ఈమె గత కొంత కాలంగా జార్జ్ పనయోటో అనే లండన్ వ్యాపారితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నారు అని అనుకునే లోపే అమీ జాక్సన్ ఒక సంచలన వార్త ప్రకటించింది.

తాజాగా అమీ జాక్సన్ సోషల్ మీడియా ద్వారా తాను గర్భవతి అయినట్లు పోస్ట్ చేసింది. పెళ్లి కాకుండానే తల్లి అయ్యిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “ఈ విషయాన్ని టెర్రస్ మీదకు వెళ్లి అందరికీ గట్టిగా అరచి మరీ చెప్పాలని ఉంది. నేడు బ్రిటన్ లో మదర్స్ డే. ఈ విషయం చెప్పడానికి మాతృదినోత్సవం మించిన మంచి రోజు ఏముంటుంది.

నువ్వు పుట్టకముందే ప్రపంచంలో నేను నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిన్ను చూసేందుకు ఎదురుచూస్తున్నాము” అని అమీ జాక్సన్ ఇంస్టాగ్రామ్ లో తనకు కాబోయో భర్తతో ఉన్న ఫొటోని షేర్ చేసింది. ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags:    
Advertisement

Similar News