ప్రభాస్ పెళ్లి పై.... పెద్దమ్మ స్పందన

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల కోసం సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ పోతున్నాడే కానీ ఇప్పటి వరకు మాత్రం పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రభాస్ ఎప్పటికప్పుడు పెళ్లిని వాయిదా వేస్తూనే వస్తున్నాడు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ పెళ్లి వార్త పై ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే క్రిష్ణంరాజు భార్య శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి […]

Advertisement
Update:2019-03-08 09:57 IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల కోసం సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ పోతున్నాడే కానీ ఇప్పటి వరకు మాత్రం పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు.

ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రభాస్ ఎప్పటికప్పుడు పెళ్లిని వాయిదా వేస్తూనే వస్తున్నాడు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ పెళ్లి వార్త పై ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే క్రిష్ణంరాజు భార్య శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి ఎందుకు వాయిదా పడుతుంది? అసలు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ఉంటుంది? అనే విషయాలు చెప్పుకొని వచ్చింది.

ఆమె మాట్లాడుతూ “మాది చాలా పెద్ద కుటుంబం…. మా ఫ్యామిలీ లో ఇమిడిపోయే అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాం. క్రిష్ణంరాజు గారు ప్రతి ఏడాది గెట్ టు గెదర్ ఫంక్షన్ చేస్తారు. అప్పుడు మా మొత్తం కుటుంబం కలుస్తుంది. ఇక ఈ ఏడాది ప్రభాస్ కి సెట్ అయ్యే అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే “సాహో” “జాన్” సినిమాలు పూర్తి కాగానే ప్రభాస్ ని కూడా తప్పకుండా ఒప్పించి పెళ్లి జరిపించేస్తాం” అని చెప్పుకొచ్చింది ప్రభాస్ పెద్దమ్మ.

Tags:    
Advertisement

Similar News