మహేష్ కూడా హీరో అయిపోయాడోచ్!

అదేంటి.. మహేష్ హీరో అవ్వడమేంటి? ఎప్పుడో హీరో అయ్యాడు కదా. ఆల్రెడీ 24 సినిమాలు చేసి, 25వ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు కదా. ఇప్పుడు మనం చెప్పుకునేది సూపర్ స్టార్ మహేష్ గురించి కాదు. కామెడీ స్టార్ మహేష్ గురించి. రంగస్థలం, మహానటి సినిమాలతో పాపులర్ అయిన ఈ పొడుగు మహేష్ కూడా హీరో అయ్యాడు. “నేను నా నాగార్జున” అనే సినిమా చేశాడు. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. బయ్యర్ల కోసం […]

Advertisement
Update:2019-02-27 00:32 IST

అదేంటి.. మహేష్ హీరో అవ్వడమేంటి? ఎప్పుడో హీరో అయ్యాడు కదా. ఆల్రెడీ 24 సినిమాలు చేసి, 25వ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు కదా. ఇప్పుడు మనం చెప్పుకునేది సూపర్ స్టార్ మహేష్ గురించి కాదు. కామెడీ స్టార్ మహేష్ గురించి. రంగస్థలం, మహానటి సినిమాలతో పాపులర్ అయిన ఈ పొడుగు మహేష్ కూడా హీరో అయ్యాడు. “నేను నా నాగార్జున” అనే సినిమా చేశాడు.

సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. బయ్యర్ల కోసం వెయిటింగ్. ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి మంచి టైమింగ్ కోసం కూడా వెయిటింగ్. హీరోగా మహేష్ కు ఇదే మొదటి సినిమా. ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు హీరోలుగా మారారు. షకలక శంకర్, సప్తగిరి లాంటి హాస్యనటులైతే కామెడీ పాత్రల కంటే హీరో వేషాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మహేష్ కూడా చేరిపోయాడన్నమాట.

ఆర్బీ గోపాల్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సోమి వర్మ హీరోయిన్ గా నటించింది. గండపు నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ టైమ్ నడుస్తోంది. ఈ సినిమా హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    
Advertisement

Similar News