అర్జున్ రెడ్డి రీమేక్.... ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ వంతు

తమిళనాట అర్జున్ రెడ్డి రీమేక్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటివరకు ఈ సినిమాను రీషూట్ చేస్తారని మాత్రమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మొత్తం సినిమానే మళ్లీ తీయబోతున్నారు. ఏవో కొన్ని సన్నివేశాలు తీయడం కాదు, ప్రతి ఫ్రేమ్ ను రీషూట్ చేయబోతున్నారు. ఈ మేరకు దర్శకుడు బాలను తొలిగించి, తెలుగులో అర్జున్ రెడ్డి మూవీకి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన ఓ వ్యక్తికి దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. హీరోయిన్ గా కూడా గతంలో […]

Advertisement
Update:2019-02-19 14:50 IST

తమిళనాట అర్జున్ రెడ్డి రీమేక్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటివరకు ఈ సినిమాను రీషూట్ చేస్తారని మాత్రమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మొత్తం సినిమానే మళ్లీ తీయబోతున్నారు. ఏవో కొన్ని సన్నివేశాలు తీయడం కాదు, ప్రతి ఫ్రేమ్ ను రీషూట్ చేయబోతున్నారు.

ఈ మేరకు దర్శకుడు బాలను తొలిగించి, తెలుగులో అర్జున్ రెడ్డి మూవీకి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన ఓ వ్యక్తికి దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. హీరోయిన్ గా కూడా గతంలో నటించిన హీరోయిన్ ను పక్కనపెట్టి, బనిత సంధు అనే మరో ముద్దుగుమ్మను తీసుకున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ను కూడా మార్చేశారు.

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ సినిమా కోసం స్టార్ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ను తీసుకున్నారు. తమిళ్ లో లాంగ్ గ్యాప్ తర్వాత రవి కె చంద్రన్ హ్యాండిల్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. కొడుకు అరంగేట్రం చేస్తున్న సినిమా కోసం స్వయంగా విక్రమ్, అతడ్ని సంప్రదించి ఒప్పించాడు.

త్వరలోనే కొత్త టెక్నీషియన్లు, కొత్త హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులతో వర్మ రీషూట్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఇదే అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అవుతోంది. ఆ సినిమాకు రవి కె చంద్రన్ కొడుకు శంతన్ క్రిష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News