పుల్వామా దాడి మాస్టర్ మైండ్ హతం
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి సూత్రధారిని భారత ఆర్మీ మట్టుపెట్టింది. పుల్వామాలోని పింగ్లాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మాస్టర్ మైండ్ ఘాజీని ఆర్మీ హతమార్చింది. పింగ్లాన్‌లోని ఒక ఇంటిలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో రాత్రి ఒంటి గంట సమయంలోనే ఆ ఇంటిని ఆర్మీ చుట్టుముట్టింది. ఆర్మీని చూడగానే ఉగ్రవాదులు ఇంట్లో నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తొలుత ముగ్గురు భారత జవాన్లు, ఒక మేజర్ మరణించారు. ఆ తర్వాత కూడా ఎదురుకాల్పులు కొనసాగాయి. చివరకు ఇంట్లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టింది. […]
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి సూత్రధారిని భారత ఆర్మీ మట్టుపెట్టింది. పుల్వామాలోని పింగ్లాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మాస్టర్ మైండ్ ఘాజీని ఆర్మీ హతమార్చింది.
పింగ్లాన్‌లోని ఒక ఇంటిలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో రాత్రి ఒంటి గంట సమయంలోనే ఆ ఇంటిని ఆర్మీ చుట్టుముట్టింది. ఆర్మీని చూడగానే ఉగ్రవాదులు ఇంట్లో నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తొలుత ముగ్గురు భారత జవాన్లు, ఒక మేజర్ మరణించారు.
ఆ తర్వాత కూడా ఎదురుకాల్పులు కొనసాగాయి. చివరకు ఇంట్లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టింది. పుల్వామా దాడికి మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న ఘాజీ ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అతడితోపాటు మరో ఉగ్రవాది కమ్రాన్ కూడా ఎదురుకాల్పుల్లో మరణించాడు. వీరిద్దరు జైషే ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు.