మహేష్ నిర్మాత, సుధీర్ బాబు హీరో

సొంత బంధువులైన వీళ్లిద్దరూ ఇన్నాళ్లకు కలిశారు. మొన్నటివరకు వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని చాలామంది భావించారు. ఎట్టకేలకు వీళ్లిద్దరూ కలిశారు. కానీ తెరపై మాత్రం ఒకే ఫ్రేమ్ లో కనిపించరు. అవును… మహేష్ నిర్మాతగా మారి తీయబోతున్న ఓ వెబ్ సిరీస్ లో సుధీర్ బాబు హీరోగా నటించబోతున్నాడు. తన పేరుపై చాన్నాళ్ల కిందటే ప్రొడక్షన్స్ హౌజ్ పెట్టాడు మహేష్. నేరుగా సినిమాలు తీయకపోయినా తను నటిస్తున్న చాలా సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు […]

Advertisement
Update:2019-02-18 00:32 IST

సొంత బంధువులైన వీళ్లిద్దరూ ఇన్నాళ్లకు కలిశారు. మొన్నటివరకు వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని చాలామంది భావించారు. ఎట్టకేలకు వీళ్లిద్దరూ కలిశారు. కానీ తెరపై మాత్రం ఒకే ఫ్రేమ్ లో కనిపించరు. అవును… మహేష్ నిర్మాతగా మారి తీయబోతున్న ఓ వెబ్ సిరీస్ లో సుధీర్ బాబు హీరోగా నటించబోతున్నాడు.

తన పేరుపై చాన్నాళ్ల కిందటే ప్రొడక్షన్స్ హౌజ్ పెట్టాడు మహేష్. నేరుగా సినిమాలు తీయకపోయినా తను నటిస్తున్న చాలా సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు తన బ్యానర్ పై ఓ వెబ్ సిరీస్ నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. చార్లి అనే పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో సుధీర్ బాబు హీరోగా నటించబోతున్నాడు. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ప్రత్యక్షం కానుంది.

హీరోగా నటిస్తూనే వ్యాపారాలపై కూడా దృష్టిపెట్టాడు మహేష్. ఇప్పటికే తన సినిమాలకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న మహేష్.. ఏషియన్ గ్రూప్ తో కలిసి మల్టీప్లెక్స్ చైన్ ప్రారంభించాడు. ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మాణంలోకి ప్రవేశించాడు.

Tags:    
Advertisement

Similar News