ఇండియన్ క్రికెటర్ స్లెడ్జింగ్ తో ప్రధాని ఫిదా..!
ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్లెడ్జింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాడు. అలా ఇలా కాదు ఆస్ట్రేలియా దేశ ప్రధాని సైతం పంత్ స్లెడ్జింగ్ పై ఫిదా అయ్యాడు. నువ్వు పంత్ కదా..పోటా పోటీగా ఆట ఆడే నీలాంటి ఆటగాళ్లంటే మాకెంతో ఇష్టం అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత క్రికెటర్ రిషభ్ పంత్ , ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. […]
ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్లెడ్జింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాడు. అలా ఇలా కాదు ఆస్ట్రేలియా దేశ ప్రధాని సైతం పంత్ స్లెడ్జింగ్ పై ఫిదా అయ్యాడు. నువ్వు పంత్ కదా..పోటా పోటీగా ఆట ఆడే నీలాంటి ఆటగాళ్లంటే మాకెంతో ఇష్టం అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత క్రికెటర్ రిషభ్ పంత్ , ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రత్యర్ధుల్ని తమ మాటలతో కవ్వించే ప్రయత్నం చేసి మ్యాచ్ లను మలుపు తిప్పేలా ఆస్ట్రేలియా క్రికెటర్లు వ్యూహాలు రచయిస్తుంటారు. ఆ వ్యూహాలతో ప్రత్యర్ధిని బోల్తా కొట్టిస్తారు. ఒక్కోసారి నవ్వుల పాలవుతుంటారు. అలాంటి వ్యూహాల్ని వారసత్వంగా వణికిపుచ్చుకున్న ఆసిస్ క్రికెటర్లు బాక్సింగ్ డే టెస్ట్ లో ఇండియన్ వికెట్ కీపర్ పంత్ ను అస్త్రంగా ఉపయోగించుకున్నారు.
మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న పంత్ ను ఉద్దేశిస్తూ తోటి సహచరులతో ఆసిస్ కెప్టెన్ టిమ్ పెయిన్ ఇలా వ్యాఖ్యానించాడు. ఇండియన్ టీం తరుపున ఆడేందుకు ధోనీ వచ్చేశాడు. ఆస్ట్రేలియాలో అందమైన నగర్ హోబర్ట్. హోబర్ట్ నగరం తరుపున ఆడే జట్టుకు బ్యాట్స్ మెన్ చాలా అవసరం. పంత్ నేను చెప్పింది గుర్తుపెట్టుకో . హోబర్ట్ జట్టు తరుపున ఆడితే. ఆస్ట్రేలియా టూర్‌ను నువ్వు మరింత పొడిగించుకోవచ్చు. వాటర్ ఫాంట్ దగ్గర మంచి అపార్ట్‌మెంట్ కొనుక్కోవచ్చు. అంతటితో ఆగకుండా నువ్వు పిల్లల్ని బాగా చూసుకుంటావా. అయితే రాత్రికి డిన్నర్ కి వచ్చే. నేను, నా భార్య ఇద్దరం సినిమాకి వెళతాం. నువ్వు పిల్లలకు కాపాలాగా ఉంటావా అంటూ వ్యాఖ్యానించాడు.
పెయిన్ వ్యాఖ్యలపై పంత్ గట్టిగానే బదులిచ్చాడు. టెంపరరీ కెప్టెన్ అంటూ వెటకారంగా రిప్లయి ఇచ్చాడు. ఆ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆసిస్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తూ నెటిజన్లు ట్రోల్ చేసి పడేశారు.
ఈ నేపథ్యంలో న్యూఇయర్ సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ జట్టుకు ఆదేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తన నివాసంలో భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ఇరు దేశాల క్రికెటర్లను ఆహ్వానించాడు. మోరిసన్ ఆహ్వానంతో ప్రత్యేక విందుకు హాజరైన పంత్ పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించాడు.
తొలిసారి స్లెడ్జింగ్ చేసి వైరల్ అవ్వడంతో మోరిసన్ సైతం పంత్ ను ఈజీగా గుర్తుపట్టాడు. వింధు సమయంలో ఒకరినొకరు విష్ చేసుకుంటుండగా పంత్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ… నువ్వు స్లెడ్జింగ్ చేస్తావు కదా.. పోటాపోటీగా ఆట ఆడే నీలాంటి ఆటగాళ్లంటే మాకెంతో ఇష్టం ఆస్ట్రేలియా ప్రధాని ఆకాశానికెత్తేశాడు.