స్వైన్ ఫ్లూతో సీనియర్ ఐపీఎస్ మృతి
స్వైన్ ఫ్లూ బారినపడి సీనియర్ ఐపీఎస్ అధికారి మధుకర్ శెట్టి హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫేక్షన్తో మధుకర్ శెట్టి బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గచ్చిబౌళిలోని కాంటినెంటల్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో మధుకర్ శెట్టి కి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు తేలింది. దీంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆయనను ఐసీయూలో ఉంచి […]
స్వైన్ ఫ్లూ బారినపడి సీనియర్ ఐపీఎస్ అధికారి మధుకర్ శెట్టి హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫేక్షన్తో మధుకర్ శెట్టి బాధపడుతున్నారు.
పరిస్థితి విషమించడంతో గచ్చిబౌళిలోని కాంటినెంటల్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో మధుకర్ శెట్టి కి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు తేలింది. దీంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆయనను ఐసీయూలో ఉంచి ప్రత్యేకంగా చికిత్స అందించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో మధుకర్ శెట్టి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
కర్ణాటకకు చెందిన మధుకర్ శెట్టి 1999 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవాడు. ఆయన హైదరాబాద్‌కు రాకముందు చిక్ మంగుళూరు ఎస్పీగా పనిచేశాడు. అంతేకాకుండా కర్ణాటక లోకాయుక్తలో సమర్థవంతంగా సేవలు అందించడంతో పాటు నిజాయితీ పరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మధుకర్ కన్నుమూతతో ఆయన సన్నిహితులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.