సిక్స్ కొడితే నేను మారిపోతా... స్టంప్ మైక్‌లో రికార్డ్ అయిన ఆసీస్ కెప్టెన్ కవ్వింపు
పుట్టుకతో వచ్చే బుద్ది… హఠాత్తుగా మారదని నిరూపించుకున్నాడు ఆసీస్ కెప్టెన్. ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోలేని సమయంలో స్లెడ్జింగ్‌కు దిగడంలో సమర్థులైన ఆసీస్ ఆటగాళ్లు ఇప్పుడు మరోసారి అదే పనిచేశారు. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన రోహిత్ శర్మను కదల్చలేక దృష్టి మళ్లింపు కార్యక్రమం మొదలుపెట్టాడు ఆసీస్ కెప్టెన్ టిమ్ ఫైన్. అయితే ఇదంతా స్టంప్ మైకుల్లో రికార్డు అయింది. కీపింగ్‌లో ఉన్న పైన్… షార్ట్ మిడ్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫించ్‌తో మాట్లాడుతున్నట్టుగా నటించాడు. ”నీవు ఐపీఎల్ లో […]
పుట్టుకతో వచ్చే బుద్ది… హఠాత్తుగా మారదని నిరూపించుకున్నాడు ఆసీస్ కెప్టెన్. ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోలేని సమయంలో స్లెడ్జింగ్‌కు దిగడంలో సమర్థులైన ఆసీస్ ఆటగాళ్లు ఇప్పుడు మరోసారి అదే పనిచేశారు.
హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన రోహిత్ శర్మను కదల్చలేక దృష్టి మళ్లింపు కార్యక్రమం మొదలుపెట్టాడు ఆసీస్ కెప్టెన్ టిమ్ ఫైన్. అయితే ఇదంతా స్టంప్ మైకుల్లో రికార్డు అయింది.
కీపింగ్‌లో ఉన్న పైన్… షార్ట్ మిడ్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫించ్‌తో మాట్లాడుతున్నట్టుగా నటించాడు. ”నీవు ఐపీఎల్ లో అన్ని జట్ల తరపున ఆడావు కదా” అని ఆరోన్ ఫించ్‌ను కెప్టెన్ టిమ్ పైన్ ప్రశ్నించాడు.
అందుకు ”లేదు లేదు… నేను బెంగళూరు జట్టు తరపున ఆడలేదు” అని ఫించ్ చెప్పాడు. ఫించ్ వ్యాఖ్యలను రోహిత్ శర్మ వైపు మళ్లించిన కెప్టెన్ టిమ్ పైన్…. ”ఇప్పుడు రోహిత్ శర్మ సిక్సర్ కొడితే నేను ముంబైకి మద్దతు ఇస్తా” అంటూ రోహిత్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు.
కానీ రోహిత్ శర్మ శాంతమూర్తిగానే ఆట కొనసాగించాడు. ఆసీస్ కెప్టెన్ కవ్వింపు వ్యవహారం ఆడియో స్టంప్ మైక్ లో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.
"If Rohit hits a six here I'm changing to Mumbai" ?#AUSvIND pic.twitter.com/JFdHsAl84b
— cricket.com.au (@cricketcomau) December 27, 2018