విద్యార్థుల బట్టలూడదీసి.... టీచర్ల పైశాచికత్వం.... పుంగనూరులో ఘటన

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. స్కూల్‌కు లేటుగా వచ్చారంటూ చిన్నపిల్లల పట్ల అమానుషంగా టీచర్లు ప్రవర్తించారు. లేట్‌గా వచ్చిన ఐదుగురు విద్యార్థులను బట్టలూడదీసి ఎండలో నిల్చోబెట్టి అవమానించారు. చైతన్య భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. విద్యార్థులను బట్టలూడదీసి అవమానించిన దృశ్యాలను కొందరు స్థానికులు రికార్డు చేశారు. స్కూల్‌కు పిల్లలు ఉదయం 8.40 నిమిషాలకు రావాల్సి ఉంది. కానీ ఐదుగురు చిన్నారుల్లో ఒకపిల్లాడు ఐదు నిమిషాలు లేట్‌గా వచ్చాడు. మరో నలుగురు పది […]

Advertisement
Update:2018-12-27 05:36 IST

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. స్కూల్‌కు లేటుగా వచ్చారంటూ చిన్నపిల్లల పట్ల అమానుషంగా టీచర్లు ప్రవర్తించారు. లేట్‌గా వచ్చిన ఐదుగురు విద్యార్థులను బట్టలూడదీసి ఎండలో నిల్చోబెట్టి అవమానించారు.

చైతన్య భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. విద్యార్థులను బట్టలూడదీసి అవమానించిన దృశ్యాలను కొందరు స్థానికులు రికార్డు చేశారు. స్కూల్‌కు పిల్లలు ఉదయం 8.40 నిమిషాలకు రావాల్సి ఉంది. కానీ ఐదుగురు చిన్నారుల్లో ఒకపిల్లాడు ఐదు నిమిషాలు లేట్‌గా వచ్చాడు.

మరో నలుగురు పది నిమిషాలు లేట్‌గా వచ్చారు. దీంతో ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థిని అర్థనగ్నంగా ఎండలో నిలబెట్టారు. పది నిమిషాలు ఆలస్యం వచ్చిన నలుగురు విద్యార్థులను పూర్తి నగ్నంగా నిలబెట్టారు. ఈ పిల్లలు నాలుగో తరగతి చదువుతున్నారు.

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు… పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. వీడియో కూడా బయటకు రావడంతో విద్యాశాఖ అధికారులు స్కూల్‌ వద్దకు వచ్చారు.

మరోసారి ఇలా జరగకుండా చూస్తామని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ప్రిన్సిపల్ నాగరాజు నాయుడు పోలీసులు, అధికారులను కోరారు. గతంలో కూడా ఈ స్కూల్‌లో విద్యార్థులను ఇలా వేధించిన సంఘటనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News