బాలక్రిష్ణ విషయంలో మా నాన్న చేసింది కరెక్ట్ " వరుణ్ తేజ్

నాగబాబు, బాలక్రిష్ణ మధ్యలో మాటల యుద్ధం నడించింది అనే సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో బాలక్రిష్ణ అంటే ఎవరో నాకస్సలు తెలియదు అని చెప్పేసాడు నాగబాబు. మళ్ళీ మరుసటి రోజే బాలక్రిష్ణ మీదే సెటైర్ వేస్తూ నాగ బాబు ఒక వీడియో రిలీజ్ చేసాడు. అయితే ఈ ఇష్యూ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నోరు విప్పాడు. బాలయ్య ని ఎందుకు అలా అన్నావు నాన్న అని వరుణ్ తేజ్ నాగబాబు […]

Advertisement
Update:2018-12-25 05:28 IST

నాగబాబు, బాలక్రిష్ణ మధ్యలో మాటల యుద్ధం నడించింది అనే సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో బాలక్రిష్ణ అంటే ఎవరో నాకస్సలు తెలియదు అని చెప్పేసాడు నాగబాబు.

మళ్ళీ మరుసటి రోజే బాలక్రిష్ణ మీదే సెటైర్ వేస్తూ నాగ బాబు ఒక వీడియో రిలీజ్ చేసాడు. అయితే ఈ ఇష్యూ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నోరు విప్పాడు.

బాలయ్య ని ఎందుకు అలా అన్నావు నాన్న అని వరుణ్ తేజ్ నాగబాబు ని అడిగాడట. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అని బాలక్రిష్ణ అన్నాడు అందుకే నేను అలా అన్నాను అని చెప్పాడట నాగబాబు.

కట్ చేస్తే నాగబాబు పై బాలయ్య అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అయినప్పటికీ నాగబాబు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నా తమ్ముడ్ని విమర్శిస్తే నేను సహించేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు నాగబాబు. దీనికి వరుణ్ తేజ్ సపోర్ట్ చేస్తున్నాడు. మా నాన్న అన్న దాంట్లో నాకేం తప్పనిపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

Tags:    
Advertisement

Similar News