"పడి పడి లేచె మనసు" సినిమా రివ్యూ
రివ్యూ: పడి పడి లేచె మనసు రేటింగ్: 2.25/5 తారాగణం: శర్వానంద్, సాయి పల్లవి తదితరులు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి దర్శకత్వం: హను రాఘవపూడి యంగ్ హీరో శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ కలిసి జంటగా నటించిన సినిమా “పడి పడి లేచె మనసు”. ఇద్దరు మంచి నటులు ఈ సినిమా కోసం జత కట్టారు అని తెలియగానే ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఈ సినిమాని “అందాల […]
రివ్యూ: పడి పడి లేచె మనసు
రేటింగ్: 2.25/5
తారాగణం: శర్వానంద్, సాయి పల్లవి తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి
దర్శకత్వం: హను రాఘవపూడి
యంగ్ హీరో శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ కలిసి జంటగా నటించిన సినిమా “పడి పడి లేచె మనసు”. ఇద్దరు మంచి నటులు ఈ సినిమా కోసం జత కట్టారు అని తెలియగానే ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి.
పైగా ఈ సినిమాని “అందాల రాక్షసి” వంటి సినిమాని డైరెక్ట్ చేసిన హను రాఘవపూడి డైరెక్ట్ చేసాడు. టిజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
సూర్య (శర్వానంద్) కొలకత్తా లో సెటిల్ అయిన ఫుట్ బాల్ ప్లేయర్. ఒకసారి అనుకోకుండా వైశాలిని (సాయి పల్లవి) చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. సూర్య ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి ఫైనల్ గా వైశాలిని ప్రేమలో పడేస్తాడు. అలా ఇద్దరు హాయిగా ప్రేమించుకుంటున్న తరుణంలో వైశాలి పెళ్ళి టాపిక్ తీసుకొని వస్తుంది. అసలు పెళ్ళి పై పాజిటివ్ ఒపీనియన్ లేని సూర్య పెళ్ళి గిల్లి నాతో సెట్ అవ్వవు అని వైశాలికి బ్రేక్ అప్ చెప్పి వెళ్ళిపోతాడు. అసలు సూర్య కి పెళ్లి అంటే ఎందుకు ఇష్టం లేదు? వైశాలి మళ్ళీ సూర్య ఎలా కలిసింది అనేది మిగిలిన కథ.
ఎప్పటిలాగే శర్వానంద్ ఈ సినిమాలో హ్యాండ్సం గా కనిపించాడు. ఇప్పటి వరకు ట్రై చెయ్యని ఒక డిఫెరెంట్ లుక్ ని ఈ సినిమా కోసం ట్రై చేసాడు శర్వానంద్. అలాగే సినిమా మొత్తం చలాకీగా పక్కింటి కుర్రాడిగా కనిపించి మెప్పించాడు శర్వానంద్.
ఇకపోతే సాయి పల్లవి ఈ సినిమాకి హార్ట్ లాంటిది అని చెప్పొచ్చు. శర్వానంద్ లాంటి యాక్టర్ ని కూడా తన నటనతో డామినేట్ చేసింది సాయి పల్లవి. ఈ సినిమాలో చాలా అందంగా కనిపించిన పల్లవి…. సెకండ్ హాఫ్ లో చాలా అద్భుతంగా నటించింది. శర్వానంద్, సాయి పల్లవి మధ్య ఉండే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది.
ఇకపోతే సినిమాలో మురళి శర్మ తన క్యారెక్టర్ తో అందరినీ అలరించాడు. సునీల్ ఈ సినిమాలో నటించినా కూడా పెద్ద ప్రాధాన్యత లేని పాత్రలోనే కనిపించాడు. సునీల్ కామెడీ చేసినా కూడా అదేం అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రియ దర్శి తన పరిది మేరకు బాగానే ఆకట్టుకున్నాడు.
ముందుగా హను రాఘవపూడి లో ఉన్న డైరెక్టర్ కంటే కూడా రచయిత గురించి మాట్లాడాలి. కథ కథనాలు చాలా డల్ గా రాసుకున్నాడు హను రాఘవపూడి. కథ కొంత వరకు పర్వాలేదు అనిపించినా కూడా కథనంలో మాత్రం చాలా దెబ్బ తిన్నాడు.
అసలు కథ ఎటుపోతుంది అనేది కూడా పట్టించుకోకుండా సీన్స్ ని రాసుకున్నాడు హను రాఘవాపుడి. దర్శకుడు గా మాత్రం సినిమాని చాలా బాగా తెరకెక్కించాడు. ఎంత బాగా తెరకెక్కిస్తే ఏం లాభం సరైన కథనే లేదు అసలు.
ఎస్.వి.ఎల్ ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి. అలాగే జయ్ కాయ్ కెమెరా పనితనం కూడా బాగుంది. ఇకపోతే విశాల్ చంద్ర శేఖర్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఆయువు పట్టుగా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్:
- శర్వానంద్, సాయి పల్లవి
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- పాటలు
మైనస్ పాయింట్స్:
- కథనం
- సెకండ్ హాఫ్
- పస లేని సీన్స్