బామ్మర్ధి చిత్రానికి బాబు రాయితీ?
నందమూరి బాలకృష్ణ ఏంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా “ఎన్టీఆర్”. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకి పన్ను రాయితీ ఇవ్వాలనే ఆలోచన చేస్తోందట. గతం లో కూడా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన “గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాకి కూడా పన్ను రాయితీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కానీ దానికంటే ముందు ఏడాది వచ్చిన గుణశేఖర్ తీసిన “రుద్రమదేవి” సినిమాకి మాత్రం ఎలాంటి […]
నందమూరి బాలకృష్ణ ఏంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా “ఎన్టీఆర్”. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకి పన్ను రాయితీ ఇవ్వాలనే ఆలోచన చేస్తోందట. గతం లో కూడా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన “గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాకి కూడా పన్ను రాయితీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కానీ దానికంటే ముందు ఏడాది వచ్చిన గుణశేఖర్ తీసిన “రుద్రమదేవి” సినిమాకి మాత్రం ఎలాంటి పన్నురాయితీలు ఇవ్వలేదు.
ఇప్పుడు మళ్ళీ “ఎన్టీఆర్” సినిమా కోసం అలాంటి ఆలోచనే చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్టీఆర్ నటుడుగానే కాక…. తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు.
కేవలం ఈ రెండు కారణాల వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఎన్టీఆర్” సినిమాకి పన్నురాయితీ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారట. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. ఈ రెండు భాగాల్లో ఒక భాగం సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.