ఇంటర్వెల్ ఫైట్ లో రామ్ చరణ్ విశ్వరూపం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. మాస్ కమర్షియల్ డైరెక్టర్ అయిన బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ మొదటి సారి నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను ఒక స్పెషల్ ఇంటర్వెల్ ఫైట్ ని రామ్ చరణ్ కోసం డిజైన్ చేసాడు అంట. ఈ ఫైట్ ను దర్శకుడు బోయపాటి […]
Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా “వినయ విధేయ రామ”. మాస్ కమర్షియల్ డైరెక్టర్ అయిన బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ మొదటి సారి నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను ఒక స్పెషల్ ఇంటర్వెల్ ఫైట్ ని రామ్ చరణ్ కోసం డిజైన్ చేసాడు అంట. ఈ ఫైట్ ను దర్శకుడు బోయపాటి చాలా శ్రద్ద పెట్టి చిత్రీకరించినట్లుగా ఫిల్మ్ వర్గాల టాక్.
దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్స్ పాల్గొన్న ఈ ఇంటర్వెల్ ఫైట్ సినిమా స్థాయిని మరింత పెంచేదిగా ఉంటుందని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ చిత్రం కేవలం మాస్ ప్రేక్షకులనే కాక, ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా నచ్చే విధంగా ఉంటుందట. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, స్నేహ రామ్ చరణ్ కి అన్న వదినలుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
Advertisement