ఇది ముద్దుల మధ్య ప్రేమకథ మాత్రమే
ప్రస్తుతం టాలీవుడ్ లో వివాదాస్పదమౌతున్న సినిమా 24 కిస్సెస్. సినిమాలో ఓ రేంజ్ లో ముద్దు సీన్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అక్షరాలా 24 లిప్ కిస్సులున్నాయి. అందుకే సెన్సార్ కూడా ఈ సినిమాకు ఏ-సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే తమ సినిమాలో బూతు ఉండదని, 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి ఈ సినిమా చూడొచ్చని అంటున్నాడు దర్శకుడు అయోధ్య కుమార్. “24 కిస్సెస్ అనగానే చాలా మంది ఇది బూతు సినిమా అనుకుంటున్నారు. కానేకాదు. అన్ని […]
Advertisement
ప్రస్తుతం టాలీవుడ్ లో వివాదాస్పదమౌతున్న సినిమా 24 కిస్సెస్. సినిమాలో ఓ రేంజ్ లో ముద్దు సీన్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అక్షరాలా 24 లిప్ కిస్సులున్నాయి. అందుకే సెన్సార్ కూడా ఈ సినిమాకు ఏ-సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే తమ సినిమాలో బూతు ఉండదని, 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి ఈ సినిమా చూడొచ్చని అంటున్నాడు దర్శకుడు అయోధ్య కుమార్.
“24 కిస్సెస్ అనగానే చాలా మంది ఇది బూతు సినిమా అనుకుంటున్నారు. కానేకాదు. అన్ని ఎమోషన్స్ వున్న అందమైన ప్రేమకథ. క్లీన్ ఎంటర్ టైనర్ ఫిలిం. ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు. మిణుగురులు లాంటి మంచి సినిమా తీసిన నా నుండి వల్గర్, బూతు సినిమా రాదు. మిణుగురులు టీమ్ నుండి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది.”
ఇలా విడుదలకు ముందు సినిమాపై ముసురుకున్న వివాదాల్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ముద్దు నుంచి మొదలై.. 24వ ముద్దుతో ముగుస్తుంది. ఈ ముద్దుల మధ్య ఈ ప్రేమజంట కథ ఏమైంది, అసలు 24 ముద్దులకు సినిమాకు లింక్ ఏంటి అనేది అసలు కథ.
Advertisement