యంగ్ డైరెక్టర్ కి సారీ చెప్పిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక యంగ్ డైరెక్టర్ కి క్షమాపణలు చెప్పి తన మంచి మనసును చాటుకున్నాడు. అల్లు అర్జున్ డైరెక్టర్ కి క్షమాపణలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా…. ముందుగా అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ ఇటివలే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన “టాక్సీ వాలా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అక్కడ స్టేజి మీదకి వెళ్ళాక అల్లు అర్జున్ మూవీ యూనిట్ గురించి చాలా గొప్పగా […]

Advertisement
Update:2018-11-22 06:43 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక యంగ్ డైరెక్టర్ కి క్షమాపణలు చెప్పి తన మంచి మనసును చాటుకున్నాడు. అల్లు అర్జున్ డైరెక్టర్ కి క్షమాపణలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా…. ముందుగా అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ ఇటివలే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన “టాక్సీ వాలా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అక్కడ స్టేజి మీదకి వెళ్ళాక అల్లు అర్జున్ మూవీ యూనిట్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు, కానీ ఒక్క డైరెక్టర్ గురించి తప్ప.

అయితే ఇటివలే డైరెక్టర్ కి ఒక పార్టీ లో కలిసిన అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ దగ్గరకి వెళ్లి మరి క్షమాపణలు చెప్పాడట. డైరెక్టర్ అనేవాడు సినిమాకి ఎంతో ముఖ్యం అలాంటి డైరెక్టర్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి అంటూ కుర్ర డైరెక్టర్ దగ్గర మాట్లాడాడు. ఈ విషయాన్నీ స్వయానా “టాక్సీ వాలా” డైరెక్టర్ రాహుల్ ఇటివలే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అసలు అంత స్టార్ స్టేటస్ ఉన్న ఒక హీరో నా దగ్గరకి వచ్చి క్షమాపణలు చెప్పడం అని చాల గ్రేట్ అంటూ అల్లు అర్జున్ ని పొగిడేస్తున్నాడు రాహుల్.

Tags:    
Advertisement

Similar News