నిర్మాతకి, హీరోకి మధ్య గొడవ ....

గత కొన్ని నెలలుగా సెట్స్ పైకి వెళుతుంది అని ఎదురుచూస్తున్న సుధీర్ బాబు సినిమా పట్టాలు తప్పి, పక్కన కూర్చుంది. ఆగష్టు లో ఈ సినిమాకి ముహూర్తం షాట్ ని కొట్టారు. ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత. పులి వాసు ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాలని అన్నీ సెట్ చేసుకున్నారు రిజ్వాన్. అయితే సుధీర్ బాబు కి, రిజ్వాన్ కి మధ్య కొన్ని మాటల యుద్ధాలు జరిగాయని…. దాని కారణంగా ఈ సినిమా […]

Advertisement
Update:2018-11-14 11:51 IST

గత కొన్ని నెలలుగా సెట్స్ పైకి వెళుతుంది అని ఎదురుచూస్తున్న సుధీర్ బాబు సినిమా పట్టాలు తప్పి, పక్కన కూర్చుంది. ఆగష్టు లో ఈ సినిమాకి ముహూర్తం షాట్ ని కొట్టారు. ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత. పులి వాసు ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాలని అన్నీ సెట్ చేసుకున్నారు రిజ్వాన్.

అయితే సుధీర్ బాబు కి, రిజ్వాన్ కి మధ్య కొన్ని మాటల యుద్ధాలు జరిగాయని…. దాని కారణంగా ఈ సినిమా ని ఆపేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందని ఎదురుచూసిన ప్రేక్షకులకి ఇప్పుడు నిజం తెలిసింది.

అందరూ అనుకున్నట్టే ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు రిజ్వాన్ అదే కథని హీరో శ్రీవిష్ణు తో తెరకెక్కిస్తున్నాడు.
దర్శకుడు ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు. మొత్తానికి సుధీర్ బాబు రిజ్వాన్ ప్రాజెక్ట్ ని వదిలేసి ప్రస్తుతం దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు “పుల్లెల గోపీచంద్” బయోపిక్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని 2019లో విడుదల చేస్తామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News