"సర్కార్" సినిమా రివ్యూ

రివ్యూ:  సర్కార్ రేటింగ్‌: 2/5 తారాగణం: విజయ్, కీర్తి సురేష్, కరుపయ్య, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌ నిర్మాత: ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం: కళానిధి మారన్‌ విజయ్ హీరోగా రూపొందిన సర్కార్ మూవీ మీద మరీ భారీగా కాదు కానీ ఓ మోస్తరు అంచనాలతో తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదలైంది. పండగ సెలవులను వాడుకోవడం కోసం సంప్రదాయానికి భిన్నంగా మంగళవారం రిలీజైన ఈ మూవీ మీద మురుగదాస్ అభిమానులు గట్టి అంచనాలే పెట్టుకున్నారు. రాజకీయ నేపథ్యంలో రూపొందటంతో పాటు ఏఆర్ […]

Advertisement
Update:2018-11-06 12:16 IST

రివ్యూ: సర్కార్
రేటింగ్‌: 2/5
తారాగణం: విజయ్, కీర్తి సురేష్, కరుపయ్య, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
నిర్మాత: ఏఆర్‌ మురుగదాస్‌
దర్శకత్వం: కళానిధి మారన్‌

విజయ్ హీరోగా రూపొందిన సర్కార్ మూవీ మీద మరీ భారీగా కాదు కానీ ఓ మోస్తరు అంచనాలతో తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదలైంది. పండగ సెలవులను వాడుకోవడం కోసం సంప్రదాయానికి భిన్నంగా మంగళవారం రిలీజైన ఈ మూవీ మీద మురుగదాస్ అభిమానులు గట్టి అంచనాలే పెట్టుకున్నారు.

రాజకీయ నేపథ్యంలో రూపొందటంతో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం ఆకర్షణగా నిలవడంతో దీపావళికి సరైన ఎంటర్ టైనర్ దొరికిందనే నమ్మకంతో థియేటర్ దాకా వచ్చే ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

సుందర్ రామస్వామి(విజయ్) ఎన్నికల్లో ఓటు వేయడం కోసం విదేశాల నుంచి ఇండియా వస్తాడు. పోలింగ్ బూత్ లో అప్పటికే తన ఓటు ఎవరో దొంగతనంగా వేశారని తెలుసుకుని కోర్టుకు వెళ్లి నానా రచ్చ చేసి రీ ఎలక్షన్ దాకా తెస్తాడు. ఇది అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పుణ్యమూర్తి(కరుపయ్య)కి మింగుడు పడదు. అనూహ్య పరిణామాల వల్ల సుందర్ సీఎం పుణ్యమూర్తి పార్టీకి పోటీగా ఎలక్షన్స్ లో నిలబడేందుకు రెడీ అవుతాడు. అప్పుడు రంగప్రవేశం చేస్తుంది సిఎం కూతురు కోమలవల్లి (వరలక్ష్మి శరత్ కుమార్). ఈ రాజకీయ నాటకం చివరికి ఏ మలుపు తిరిగింది అనేదే సర్కార్ క్లైమాక్స్.

విజయ్ కు ఇది ఎన్నడూ చేయని పాత్ర కాదు. కొట్టిన పిండే. పెర్ఫార్మన్స్ కన్నా ఎక్కువగా స్టైల్ బిల్డప్ మీదే ఆధారపడి ఇలాంటివి గతంలో ఎన్నో చేసాడు. ఇందులో ఇంకాస్త చెలరేగిపోయాడు. విజయ్ అభిమానులకు కనులవిందుగా ఉంటుంది అతని పెర్ఫార్మన్స్. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ని బాగా బాలన్స్ చేసాడు. సీనియర్ హీరో కాబట్టి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. తనవరకు న్యాయం చేసాడు.

కీర్తి సురేష్ పాటల్లో డాన్స్ చేయడానికి తప్ప ఎందుకూ పనికిరాలేదు…. పైగా మేకప్ కూడా తేడా కొట్టేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ సెకండ్ హాఫ్ లో లేట్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఉన్న కాసేపు ఉనికిని చాటుకుంది. రాధారవి అలవాటుగా చేసుకుంటూ పోయాడు. కరుపయ్య మనకు అలవాటు లేని మొహం కావడంతో ఆ పాత్ర కనెక్ట్ కాదు. వీళ్ళు తప్ప ఇంకెవరికి రెండు మూడు సీన్ల కంటే ఎక్కువ ఉండవు.

మురుగదాస్ పాయింట్ అయితే డెప్త్ ఉన్నది తీసుకున్నాడు కానీ కథనంలో కావాల్సినంత డ్రామాను నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఎక్కడో విదేశాల్లో ఉన్న హీరో తన ఓటు మిస్ అయ్యింది అన్న కారణంగా రాష్ట్రాన్ని మార్చాలని కంకణం కట్టుకోవడం పేపర్ మీద చదవడానికి బాగుంటుంది కానీ తెరమీద పండాలి అంటే విజయ్ లాంటి స్టార్ హీరో ఒక్కడు ఉంటే సరిపోదు. కంటెంట్ ఉండాలి. దాస్ దీన్నే లైట్ తీసుకున్నాడు.

సింగల్ లైన్ మీద చిన్న చిన్న మలుపులతో కథను రాసుకుని మిగిలింది విజయ్ చూసుకుంటాడులే అనే బాధ్యతారాహిత్యంతో నడిపించిన తీరు విసుగు పుట్టిస్తుంది. పైగా సుందర్ పాత్ర సమాజంలో మార్పు కోసం చేసే డ్రామా అంతా కృత్రిమంగా ఉండటంతో ఎక్కడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. పొలిటికల్ థ్రిల్లర్ తీయాలంటే మురుగదాస్ లాంటి దర్శకుడైనా సరే సరైన హోమ్ వర్క్ చేయకపోతే ఫలితం ఎంత తేడాగా ఉంటుందో సర్కార్ ని బట్టి చెప్పొచ్చు.

తమిళ్ లో ఎలా ఆడుతుంది అనేది మనకు అనవసరం. తెలుగు ప్రేక్షకులకు సింక్ అయ్యే అంశాలు ఇందులో చాలా మిస్ అయ్యాయి కాబట్టి ఇది ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ తో అదరగొట్టాడు. పాటలు మాత్రం బాగాలేవు. గిరీష్ గంగాధరన్ కెమెరా వర్క్ ఒకటే మెచ్చదగినది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అభిమానులకు కనువిందుగా ఉన్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్…. ఇంకా జాగ్రత్త పడాల్సింది.

చివరిగా చెప్పాలంటే సర్కార్ ఎంతో ఆశిస్తే అంతకంతా నిరాశ కలిగించే ఒక మాములు పొలిటికల్ మూవీగా మిగిలిపోయింది. ఎక్కడా తనకు మాత్రమే సాధ్యమయ్యే ట్రేడ్ మార్క్ మురుగదాస్ టేకింగ్ కానీ…. విజయ్ సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన మెరుపులు కానీ….. ఏమి లేకుండా చప్పగా సాగిపోయి నిరాశపరుస్తుంది. విజయ్ వీరాభిమానులు కొంతవరకు సమాధాన పరుచుకున్నా సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచే సగటు సినిమానే సర్కార్.

సర్కార్ – డిపాజిట్ పోయింది

Tags:    
Advertisement

Similar News