రామ్ చరణ్ సినిమాపై క్లారిటీ

“రామ్ చరణ్ షూటింగ్ కు సమయానికి రావట్లేదట. చెప్పాపెట్టకుండా షూటింగ్స్ ఎగ్గొట్టేస్తున్నాడట. ఇతడి వ్యవహారం వల్ల బోయపాటి డైరక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా మరింత ఆలస్యం అవుతోందట. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అనుమానమే..” ఇలా రామ్ చరణ్, బోయపాటి సినిమాపై చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇవి రోజురోజుకు ఎక్కువవ్వడంతో యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రామ్ చరణ్ సినిమా సంక్రాంతికే వస్తుందని, పుకార్లు నమ్మొద్దంటూ నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించాడు. […]

Advertisement
Update:2018-11-01 06:09 IST

“రామ్ చరణ్ షూటింగ్ కు సమయానికి రావట్లేదట. చెప్పాపెట్టకుండా షూటింగ్స్ ఎగ్గొట్టేస్తున్నాడట. ఇతడి వ్యవహారం వల్ల బోయపాటి డైరక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా మరింత ఆలస్యం అవుతోందట. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అనుమానమే..”

ఇలా రామ్ చరణ్, బోయపాటి సినిమాపై చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇవి రోజురోజుకు ఎక్కువవ్వడంతో యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రామ్ చరణ్ సినిమా సంక్రాంతికే వస్తుందని, పుకార్లు నమ్మొద్దంటూ నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించాడు.

“రామ్‌చ‌ర‌ణ్‌ గారు, బోయ‌పాటి గారి కాంబినేష‌న్‌లో మా బ్యాన‌ర్‌లో సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. డైరెక్ట‌ర్ క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతూ వ‌చ్చాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ధీటుగా సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. రెండు పాట‌లు మిన‌హా న‌వంబ‌ర్ 10 నాటికి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్ 9 నుండే డ‌బ్బింగ్ ప్రారంభిస్తాం. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేయ‌బోతున్నాం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌గా సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేస్తున్నాం“

ఇలా రామ్ చరణ్ సినిమాపై పూర్తి స్పష్టత ఇచ్చాడు నిర్మాత డీవీవీ దానయ్య. దీపావళికి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి వినయ విధేయ రామ అనే టైటిల్ అనుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News