బార్లీ గింజలతో బహుళ ప్రయోజనాలు

బార్లీ గింజలంటే ఈ తరం వారికి చాలామందికి తెలిసే అవకాశం లేదు. అందువల్ల వాటి ప్రయోజనాలూ చాలా మందికి తెలియదనే చెప్పుకోవాలి. బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో బార్లీ గింజలు అద్భుతంగా తోడ్పడతాయి.  – బార్లీ గింజలు తేలికగా జీర్ణమై రక్తంలో కలసిపోతాయి. నెమ్మదిగా జీర్ణమై రోజంతటికీ కావల్సిన శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి.  – మధుమేహం ఉన్నవారికి బార్లీ గింజలు చాలా మేలు చేస్తాయి. ఉదయం అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఇన్సులిన్‌లో హెచ్చుతగ్గులు రాకుండా […]

Advertisement
Update:2018-10-21 01:52 IST
బార్లీ గింజలంటే ఈ తరం వారికి చాలామందికి తెలిసే అవకాశం లేదు. అందువల్ల వాటి ప్రయోజనాలూ చాలా మందికి తెలియదనే చెప్పుకోవాలి. బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో బార్లీ గింజలు అద్భుతంగా తోడ్పడతాయి.
– బార్లీ గింజలు తేలికగా జీర్ణమై రక్తంలో కలసిపోతాయి. నెమ్మదిగా జీర్ణమై రోజంతటికీ కావల్సిన శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి.
– మధుమేహం ఉన్నవారికి బార్లీ గింజలు చాలా మేలు చేస్తాయి. ఉదయం అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఇన్సులిన్‌లో హెచ్చుతగ్గులు రాకుండా ఉంటాయి. విడిగా తినడం కష్టం అనుకునే వారు గోధుమ పిండికి ఒక చెంచా బార్లీ గింజలని పొడి కొట్టి కలపాలి.
– బార్లీ పొడిలో ఉండే బీటా గ్లూకాన్ పీచు గోధుమ పిండిలో గ్లైసమిక్ ఇండెక్స్ స్థాయిలను తగ్గిస్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగకుండా చేస్తుంది.
– బరువు త్వరగా తగ్గాలనుకునే వారు సాధారణంగా ఓట్స్ తీసుకుంటారు. అయితే ఓట్స్ కన్నా బార్లీ వల్ల ఆరోగ్యవంతంగా, వేగంగా బరువు తగ్గుతారని పరిశోధనలలో తేలింది.
– వేసవిలో దాహార్తిని తీస్చుకోవడానికి శీతల పానీయాలకు బదులుగా మరిగించిన బార్లీ నీటిని తాగితే మంచి మేలు జరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
– పిల్లలకు బార్లీ నీరు పట్టించడం వల్ల మూత్రం దుర్వాసన రాకుండా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలుండవు.
– హార్మోన్లకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నవారు బార్లీ నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. అజీర్తి, కడుపు మంట, తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుండే వారికి బార్లీ నీరు మంచి ఫలితాలనిస్తుంది.
Tags:    
Advertisement

Similar News