సుఖనిద్రకు చక్కని చిట్కాలు
మనిషి జీవనశైలి బాగా మారిపోయింది. వేగంగా ఉరుకులు, పరుగులే జీవితమైపోయింది. అధిక శ్రమ నిత్యకృత్యమయ్యింది. దాంతో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి వారికి రాత్రిపూట నిద్ర పట్టదు. రకరకాల సమస్యలు మెదళ్లను తొలిచేస్తుంటాయి. సుఖనిద్ర సరే తగినంత నిద్ర లేక అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. మనం హాయిగా నిద్ర పోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేమిటంటే.. ⇒ పడకగదిలో అందరూ బెడ్‌లైట్‌ను వాడుతుండడం మామూలే. అవి రకరకాల రంగులలో లభ్యమవుతుంటాయి. అయితే […]
Advertisement
మనిషి జీవనశైలి బాగా మారిపోయింది. వేగంగా ఉరుకులు, పరుగులే జీవితమైపోయింది. అధిక శ్రమ నిత్యకృత్యమయ్యింది. దాంతో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి వారికి రాత్రిపూట నిద్ర పట్టదు. రకరకాల సమస్యలు మెదళ్లను తొలిచేస్తుంటాయి. సుఖనిద్ర సరే తగినంత నిద్ర లేక అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. మనం హాయిగా నిద్ర పోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేమిటంటే..
⇒ పడకగదిలో అందరూ బెడ్‌లైట్‌ను వాడుతుండడం మామూలే. అవి రకరకాల రంగులలో లభ్యమవుతుంటాయి. అయితే వాటిలో ఆకుపచ్చ రంగు లైట్‌ను వాడితే మనకు బాగా నిద్రపడుతుందట. మీరూ ట్రై చేయండి..
⇒ బైట నుంచి వచ్చే ప్రకృతి గాలిని ఆస్వాదించడం అందరికీ ఇష్టమే. అందుకే తలుపులు లేదా కిటికీలకు దగ్గరగా తమ బెడ్‌ను ఏర్పాటుచేసుకుంటారు. అయితే అది మంచిది కాదని నిపుణులంటున్నారు. మనం హాయిగా నిద్ర పోవాలంటే కిటికీలు లేని వైపు గోడకు ఆనుకుని మన బెడ్‌ను అమర్చుకుంటే నిద్ర బాగా పడుతుందట.
⇒ మనలో చాలామందికి నిద్రపోయే ముందు రకరకాల సంగీతాలను వినడం అలవాటుగా ఉంటుంది. ఇది చాలా మంచిదని నిపుణులంటున్నారు. సంగీతమే కాదు సముద్రపు అలల శబ్దం, సెలయేరు ఉరవళ్లు, జలపాతాల హోరు వంటి శబ్దాలు మనం నిద్రకు ఉపక్రమించే ముందు వింటే చాలా మంచిదట. మెల్లగా మనం నిద్రలోకి జారుకోవడానికి అవి బాగా ఉపకరిస్తాయట.
Advertisement