సుధీర్ బాబుకు పేమెంట్ ఇవ్వలేదా..?

ఓ సినిమా ఒప్పుకున్న తర్వాత ఏ హీరో అయినా ముందు అడ్వాన్స్ తీసుకుంటాడు. తర్వాత దశలవారీగా పారితోషికం అందుకుంటాడు. ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతుంటుంది. అగ్రిమెంట్ పరంగా చూసుకుంటే ఫైనల్ పేమెంట్ మాత్రం సినిమా విడుదలకు ముందు ఇచ్చేయాలి. హీరోల విషయంలో ఇంత లేట్ కూడా జరగదు. ఆఖరి షెడ్యూల్ లోనే అందేస్తుంది. అప్పటికీ ఫైనల్ పేమెంట్ అందకపోతే డబ్బింగ్ పెండింగ్ లో పెడతుంటారు చాలామంది హీరోలు. ఇప్పుడు సుధీర్ బాబుపై కూడా అలాంటి అనుమానాలే వ్యక్తం […]

Advertisement
Update:2018-10-16 16:13 IST

ఓ సినిమా ఒప్పుకున్న తర్వాత ఏ హీరో అయినా ముందు అడ్వాన్స్ తీసుకుంటాడు. తర్వాత దశలవారీగా పారితోషికం అందుకుంటాడు. ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతుంటుంది. అగ్రిమెంట్ పరంగా చూసుకుంటే ఫైనల్ పేమెంట్ మాత్రం సినిమా విడుదలకు ముందు ఇచ్చేయాలి. హీరోల విషయంలో ఇంత లేట్ కూడా జరగదు. ఆఖరి షెడ్యూల్ లోనే అందేస్తుంది. అప్పటికీ ఫైనల్ పేమెంట్ అందకపోతే డబ్బింగ్ పెండింగ్ లో పెడతుంటారు చాలామంది హీరోలు. ఇప్పుడు సుధీర్ బాబుపై కూడా అలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.

వీరభోగవసంతరాయలు సినిమాలో నటించాడు సుధీర్ బాబు. ఇందులో ఇతడితో పాటు నారా రోహిత్, శ్రీవిష్ణు కూడా నటించారు. నిన్న రిలీజైన ఈ ట్రయిలర్ లో అందరి వాయిస్ బాగుంది. సుధీర్ బాబు డబ్బింగ్ మాత్రం తేడాకొట్టేసింది. ఇంకాస్త గమనిస్తే, సుధీర్ బాబుకు వేరే వ్యక్తి డబ్బింగ్ చెప్పాడనే విషయం అర్థమౌతోంది. అతడికి పేమెంట్ అందకపోవడం వల్లనే డబ్బింగ్ చెప్పలేదంటూ ప్రస్తుతం పుకార్లు వినిపిస్తున్నాయి.

దీనిపై సుధీర్ బాబు కూడా రియాక్ట్ అయ్యాడు. వీరభోగవసంతరాయలు సినిమాలో వాయిస్ తనది కాదని, తను డబ్బింగ్ చెప్పలేదని స్పష్టంచేశాడు. అయితే దానికి కారణాల్ని మాత్రం వెల్లడించలేనని తెలిపాడు. సుధీర్ బాబు ఇలా ట్వీట్ చేయడంతో, ఇప్పుడు అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. సో.. సుధీర్ బాబు వాయిస్ లేకుండానే ఈనెల 26న థియేటర్లలోకి రాబోతోంది వీరభోగవసంతరాయలు.

Tags:    
Advertisement

Similar News