"అరవింద సమేత" సినిమా రివ్యూ

రివ్యూ: అరవింద సమేత రేటింగ్‌: 2.5/5 తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, సునీల్, జగపతిబాబు, నాగబాబు తదితరులు సంగీతం:  తమన్ నిర్మాత:  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ దర్శకత్వం:  త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో రచయితగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి దర్శకుడిగా ఎదిగి తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గౌరవం. కారణం ఆయన పెన్ను వదిలే మాటల అస్త్రాలు. గుక్క తిప్పుకోకుండా ఎలాంటి క్లిష్టమైన డైలాగ్ అయినా సులువుగా చెప్పగలిగే ఈ […]

Advertisement
Update:2018-10-11 11:24 IST

రివ్యూ: అరవింద సమేత
రేటింగ్‌: 2.5/5
తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, సునీల్, జగపతిబాబు, నాగబాబు తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

టాలీవుడ్ లో రచయితగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి దర్శకుడిగా ఎదిగి తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గౌరవం. కారణం ఆయన పెన్ను వదిలే మాటల అస్త్రాలు.

గుక్క తిప్పుకోకుండా ఎలాంటి క్లిష్టమైన డైలాగ్ అయినా సులువుగా చెప్పగలిగే ఈ తరం నటుల్లో ముందుండే వాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉంటాయా? అందుకే అరవింద సమేత వీర రాఘవకు ఇంత హైప్ సాధ్యమయ్యింది.

నల్లగుడి గ్రామానికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు) కేవలం 5 రూపాయల కోసం పక్కఊరు కామద్ధి గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు) మనిషిని చంపి ఫ్యాక్షన్ భూతానికి తెరతీస్తాడు. అక్కడి నుంచి రెండు ఊళ్ళ మధ్య రావణ కాష్టం రగులుతూ ఉంటుంది. లండన్ నుంచి చదువు పూర్తి చేసుకుని వచ్చిన నారపరెడ్డి కొడుకు వీరరాఘవరెడ్డి(జూనియర్ ఎన్టీఆర్)కళ్ళ ముందే నాన్నను చంపేస్తాడు బసిరెడ్డి. దానికి బదులుగా బసిరెడ్డి గొంతులో కత్తి దించుతాడు రాఘవ.

నాన్నమ్మ ఈ గొడవలు వద్దని చెప్పడంతో హైదరాబాద్ వచ్చేస్తాడు. అక్కడ అరవింద(పూజా హెగ్డే)తో తొలిచూపులోనే ప్రేమ. కొంత కాలం తర్వాత వీర రాఘవ తిరిగి తన ఊరికి రావాల్సి వస్తుంది. శాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతో వచ్చిన రాఘవకు సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కున్నాడు అనేదే బాలన్స్ కథ.

జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ప్రతి సినిమాకు మెరుగుపడుతూనే ఉన్నాడు. కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏమి లేదు కాబట్టి కథల పరంగా వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇందులో వీర రాఘవ రెడ్డిగా బయటికి కనిపించని కోపాన్ని పగని దిగమింగుకుని పైకి మాములుగా కనిపించే సీమ నాయకుడిగా అందులో ఒదిగిపోయాడు.

పూజా హెగ్డేతో ప్రేమలో పడే సన్నివేశాల కన్నా సీమకు వచ్చాక శాంతి కోసం పాటు పడే పాత్రలో జీవించేసాడు. పూజా హెగ్డే స్వంతంగా డబ్బింగ్ చెప్పకపోయి ఉంటే బాగుండేది. నటన జస్ట్ ఓకే. ఈషా రెబ్బా రెండు మూడు సీన్లకే పరిమితం. జగపతిబాబుని రాను రాను పోటీ పడి మరీ క్రూరంగా చూపించేస్తున్నారు. ఇందులో కూడా అంతే. బసిరెడ్డిగా భయపెట్టాడు.

క్యారెక్టర్ ఆర్టిస్టులు బోలెడు మంది ఉన్నారు. రావు రమేష్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర, సితార, దేవయాని, బ్రహ్మాజీ, రవి ప్రకాష్, శ్రీనివాసరెడ్డి అందరివీ తక్కువ స్కోప్ ఉన్న పాత్రలే. సునీల్ తన పాత దారిలోకి వచ్చేసాడు. ఇకపై హీరోగా వచ్చే ఛాన్స్ లేదని దీంతో కన్ఫర్మ్ అయిపోయింది.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా గొప్పగా చెప్పుకున్నాడు కానీ ఇది ఇప్పటికే ఎన్నోసార్లు తెరమీద అరిగిపోయిన రెండు వర్గాల రొటీన్ ఫ్యాక్షన్ కథ. కాకపోతే ఫ్యాక్షన్ రక్కసికి ముగింపు ఎలా పలకాలనే దాని గురించి చిన్న ట్విస్ట్ పెట్టి తన కలం సహాయంతో కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసాడు కానీ ఇది ఆయన కెరీర్ బెస్ట్ సినిమా ఏమి కాదు.

అయితే చూసిన ఫ్యాక్షన్ భూతాన్నే కాస్త కొత్తగా చూపించాడు అంతే. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో తేడా కొడుతోందే అనే ఫీలింగ్ కలిగించినా ఇంటర్వెల్ నుంచి తనలో రైటర్ కి దర్శకుడికి పూర్తి పని కల్పించాడు. అదే అరవింద సమేతను నిలబెట్టిన కీలక అంశం.

కాకపోతే గతంలో చూసిన ఎన్నో సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఇద్దరు సమర్ధవంతంగా తమ పాత్రలు పోషించడం వల్ల వీక్ గా ఉన్న కంటెంట్ కూడా ఈజీగా పాస్ అయిపోయేలా చేసింది. కాకపోతే త్రివిక్రమ్ లాంటి సృజనాత్మక దర్శకుడు ఇలా రొటీన్ బాట పట్టడం అతని అభిమానులకు ఏమో కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కాకపోతే కొన్ని సీన్లు చక్కగా తీయడం వల్ల స్క్రిప్ట్ లో వీక్ నెస్ లు ఎక్కడికక్కడ కవరైపోయాయి.

తమన్ ఇచ్చిన మ్యూజిక్ యావరేజే. బీజీఎమ్ కూడా పర్వాలేదు అనేలా తప్ప బెస్ట్ అనిపించుకోదు. ఆడియో రిపోర్ట్ కు తగ్గట్టే చిత్రీకరణ ఉంది. వినోద్ ఛాయాగ్రహణం బాగుంది. హారిక అండ్ హాసిని నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా చెప్పాలంటే ఒక మాములు ఫ్యాక్షన్ సినిమాను త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ డైలాగ్స్ తో చూడాలంటే అరవింద సమేత వీర రాఘవ మంచి ఛాయస్ గా నిలుస్తుంది. వీర రాఘవ రెడ్డిగా తారక్ పెర్ఫార్మన్స్ ఆయువుపట్టుగా నిలిచిన ఈ మూవీలో మరీ కొత్తదనాన్ని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

ఎంటర్ టైన్ మెంట్ విషయంలో కాస్త తేడా కొట్టినా వయొలెన్స్ ప్లస్ యాక్షన్ తో మొత్తానికి మాస్ ప్రేక్షకులతో పాటు అభిమానులను మెప్పించేలా రూపొందిన వీర రాఘవ ఓసారి చూసేందుకు రాంగ్ ఛాయస్ గా మాత్రం మిగల్లేదు.

అరవింద సమేత వీర రాఘవ – త్రివిక్రమ్ పెన్నులో సీమ రక్తం

Advertisement

Similar News