లైంగిక వేధింపుల పై స్పందించిన ఐశ్వర్య రాయ్

ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్య రాయ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇంత క్రేజ్ ఉన్న ఐశ్వర్య రాయ్ లైగింక వేధింపులపై స్పందించింది. కెరీర్ మొదట్లో ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉంది. కానీ సల్మాన్ తో తనకు సెట్ అవ్వదు అని అనుకున్న తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది. కానీ అదే సమయంలో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య గురించి చెడుగా మాట్లాడటం ఐశ్వర్య చెవిన పడటంతో అతడ్ని […]

Advertisement
Update:2018-10-11 09:41 IST

ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్య రాయ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇంత క్రేజ్ ఉన్న ఐశ్వర్య రాయ్ లైగింక వేధింపులపై స్పందించింది. కెరీర్ మొదట్లో ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉంది. కానీ సల్మాన్ తో తనకు సెట్ అవ్వదు అని అనుకున్న తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది. కానీ అదే సమయంలో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య గురించి చెడుగా మాట్లాడటం ఐశ్వర్య చెవిన పడటంతో అతడ్ని నిలదీస్తే ఐశ్వర్య ని ఇబ్బంది పెట్టాడని చెప్పింది. ఈ విషయాన్ని 2002 లోనే చెప్పింది ఈ భామ.

కట్ చేస్తే మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మీటూ ఉద్యమం సాగుతుండటంతో స్పందించింది ఐశ్వర్య రాయ్. ప్రపంచంలో ఏదో ఒక మూల తప్పనిసరిగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని వాటి గురించి బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని, అందరూ ప్రత్యేకంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ విషయాలను తెలుసుకుంటే అదే చాలని అంటోంది ఈ స్టార్ హీరోయిన్ . మీటూ ఉద్యమం మరింత పెద్దది కావాలని , ఇండస్ట్రీ లో మహిళపై దాడులు తగ్గుతాయని ఆమె తన భావాలని వ్యక్తం చేసారు.

Tags:    
Advertisement

Similar News