బాలయ్య ఆ డేర్ చేస్తారా?? 

ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో సావిత్రి బయోపిక్ ”మహానటి” పేరు తో తెరకెక్కించారు. అది మంచి ప్రేక్షకాదరణ తో మంచి విజయం సాధించింది. ఆ తరువాత బాలకృష్ణ స్వయం గా నిర్మిస్తూ, నటిస్తున్న సినిమా విశ్వవిఖ్యాత నటసర్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ అని అందరికి తెలిసిందే. ఆ బయోపిక్ సాధారణ నిడివి కన్న ఎక్కువ ఉండడం తో రెండు భాగాలు గా విడుదల చెయ్యాలని బాలయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. చేస్తే ఆ […]

Advertisement
Update: 2018-10-03 05:32 GMT

ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో సావిత్రి బయోపిక్ ”మహానటి” పేరు తో తెరకెక్కించారు. అది మంచి ప్రేక్షకాదరణ తో మంచి విజయం సాధించింది. ఆ తరువాత బాలకృష్ణ స్వయం గా నిర్మిస్తూ, నటిస్తున్న సినిమా విశ్వవిఖ్యాత నటసర్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ అని అందరికి తెలిసిందే. ఆ బయోపిక్ సాధారణ నిడివి కన్న ఎక్కువ ఉండడం తో రెండు భాగాలు గా విడుదల చెయ్యాలని బాలయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

చేస్తే ఆ తేదీలు ఏంటి అనేది ఉన్న సమాచారం మేరకు జనవరి 9, 2019 లో మొదటి భాగం, రెండు వారాలు గ్యాప్ లో అనగా జనవరి 25,2019 లో రెండోభాగం విడుదల చేస్తారట.. మొదటి భాగంలో ఎన్టీఆర్ చిన్నతనం నుండి స్టార్ గా ఎలా ఎదిగారు అన్నది, రెండో భాగం లో రాజకీయ జీవితం అనే ప్లాన్ లో ఉన్నారట.. కానీ ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ఇంత తక్కువ గ్యాప్ లో రిలీజ్ చేయాలనుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

ఇంత తక్కువ గ్యాప్ లో కలెక్షన్స్ కి నష్టం కలిగే ప్రమాదం లేకపోలేదు.. మొదటిది విడుదల అయిన రెండు వారాలు అంటే పూర్తి బడ్జెట్ కలెక్షన్స్ రాబట్టే లోపే మరో భాగం రిలీజ్ చెయ్యడం..అనేది కొంచెం కష్టమే. ఇంతకీ బాలయ్య మనసు లో ఏముందో…ఈ డేర్ బాలయ్య చేస్తారో లేదో చూడాలి

Tags:    
Advertisement

Similar News