దేవదాస్ నిడివి కూడా ఎక్కువే

సినిమా నిడివి ఎక్కువైతే ఒకప్పుడు భయపడేవారు మేకర్స్. అది మూవీపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని ఆలోచించేవారు. అందుకే ఇష్టంలేకపోయినా కొన్ని సన్నివేశాల్ని బలవంతంగా తొలిగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అర్జున్ రెడ్డి, మహానటి, భరత్ అనే నేను, రంగస్థలం.. ఇలా ఎన్నో సినిమాలు రెండున్నర గంటల కంటే ఎక్కువ నిడివితో వచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి కూడా. ఇప్పుడు దేవదాస్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏకంగా 164 […]

Advertisement
Update:2018-09-26 16:55 IST

సినిమా నిడివి ఎక్కువైతే ఒకప్పుడు భయపడేవారు మేకర్స్. అది మూవీపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని ఆలోచించేవారు. అందుకే ఇష్టంలేకపోయినా కొన్ని సన్నివేశాల్ని బలవంతంగా తొలిగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అర్జున్ రెడ్డి, మహానటి, భరత్ అనే నేను, రంగస్థలం.. ఇలా ఎన్నో సినిమాలు రెండున్నర గంటల కంటే ఎక్కువ నిడివితో వచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి కూడా. ఇప్పుడు దేవదాస్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు.

సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏకంగా 164 నిమిషాల నిడివి కలిగి ఉంది. అర్జున్ రెడ్డి అంత కాకపోయినా ఈ సినిమా డ్యూరేషన్ కాస్త ఎక్కువే. అయినప్పటికీ మేకర్స్ ఈ సినిమాను తగ్గించాలనుకోలేదు. కంటెంట్ పై నమ్మకంతో కాస్త ఎక్కువైనా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయంలో నాని, నాగార్జున నుంచి కూడా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా తెరకెక్కింది దేవదాస్ సినిమా. రష్మిక, ఆకాంక్ష హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది దేవదాస్ చిత్రం.

Tags:    
Advertisement

Similar News