సింహం రాక షురూ అయింది....

వెండితెరపై సింహం అంటే సూర్యనే. సింగం టైటిల్ తో సినిమాలు చేస్తూ… అదే సీక్వెల్ తో వరుసగా హిట్స్ కొడుతూ.. బాక్సాఫీస్ సింగం అనిపించుకుంటున్నాడు సూర్య. తాజాగా ఈ హీరో, తన మూడో సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. హరి దర్శకత్వంలో చేస్తున్న సింగం-3 సినిమాను డిసెంబర్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి సినిమా యముడు తెలుగు-తమిళ భాషల్లో పెద్ద హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన […]

Advertisement
Update:2016-09-20 09:18 IST

వెండితెరపై సింహం అంటే సూర్యనే. సింగం టైటిల్ తో సినిమాలు చేస్తూ… అదే సీక్వెల్ తో వరుసగా హిట్స్ కొడుతూ.. బాక్సాఫీస్ సింగం అనిపించుకుంటున్నాడు సూర్య. తాజాగా ఈ హీరో, తన మూడో సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. హరి దర్శకత్వంలో చేస్తున్న సింగం-3 సినిమాను డిసెంబర్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి సినిమా యముడు తెలుగు-తమిళ భాషల్లో పెద్ద హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన సింగం-2 కూడా తెలుగులో మంచి విజయాన్నందుకుంది. ఇప్పుడు అదే ఊపులో సింగం-3ను కూడా విడుదల చేస్తున్నాడు సూర్య. తెలుగు నేటివిటీకి దగ్గరగా, తెలుగోళ్లంతా ఇది తమ సినిమా అని ఫీలయ్యేలా సినిమాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు సూర్య. మరీ ముఖ్యంగా మేజర్ షెడ్యూల్ మొత్తాన్ని విశాఖలో చిత్రీకరించాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సింగం-3పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే తమిళనాట ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. తాజాగా విడుదలైన 24 సినిమాతో తన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయిన సూర్య… మాస్ ఎంటర్ టైనర్ సింగం-3తో సరికొత్త వసూళ్ల రికార్డు సృష్టించాలని తహతహలాడుతున్నాడు. నవంబర్ లో ఈ సినిమా పాటల్ని మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News