అమ్మాయిపై ఆసిడ్ పోసిన వ్యక్తికి మరణ శిక్ష
మూడేళ్ల కిందట 23 ఏళ్ల ప్రీతీ రాఠీ పై ఆసిడ్ పోసిన దిల్లీకి చెందిన అంకుర్ పన్వర్ అనే పాతికేళ్ల యువకుడికి ముంబై లోని ప్రత్యేక కోర్టు గురువారం మరణ శిక్ష విధించింది. 2013 మే రెండవ తేదీన పన్వర్ ముంబై లోని బాంద్రా టర్మినల్ బయట ప్రీతీ రాఠీపై ఆసిడ్ పోశాడు. ఆమె అదే రోజు నర్సు ఉద్యోగం చేపట్టడానికి ముంబై వెళ్లింది. అంతకు ముందు పన్వర్ ఆమెను పెళ్లి చేసుకొమ్మని అడిగాడు. ఆమె నిరాకరించడంతో […]
మూడేళ్ల కిందట 23 ఏళ్ల ప్రీతీ రాఠీ పై ఆసిడ్ పోసిన దిల్లీకి చెందిన అంకుర్ పన్వర్ అనే పాతికేళ్ల యువకుడికి ముంబై లోని ప్రత్యేక కోర్టు గురువారం మరణ శిక్ష విధించింది.
2013 మే రెండవ తేదీన పన్వర్ ముంబై లోని బాంద్రా టర్మినల్ బయట ప్రీతీ రాఠీపై ఆసిడ్ పోశాడు. ఆమె అదే రోజు నర్సు ఉద్యోగం చేపట్టడానికి ముంబై వెళ్లింది. అంతకు ముందు పన్వర్ ఆమెను పెళ్లి చేసుకొమ్మని అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాల పాలైన రాఠీ నెల రోజుల తర్వాత మరణించింది.
పన్వర్ మరణ శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత రాఠీ సోదరుడు పన్వర్ మీద దాడి చేశాడు. ఉద్దేశ పూర్వకంగానే పన్వర్ ఈ కిరాతకమైన దాడికి పాలపడినందువల్ల అతనికి మరణ శిక్ష విధించాలని కోరింది. ప్రత్యేక కోర్టు న్యామమూర్తి ఎ.ఎస్. శెండే పన్వర్ నేరాన్ని మంగళవారం నాడు ధృవీకరించి గురువారం నాడు శిక్ష ఖరారు చేసింది.
Click on Image to Read: