ఊరికే అలా చెప్పారట... దసరాకు రావట్లేదట...

నిజంగా దసరాకు రావాలనుకుంటే ఈపాటికే కాస్త హడావుడి ప్రారంభం కావాలి. షూటింగ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా జరగాలి. కానీ రామ్ చరణ్ నటిస్తున్న ధృవ సినిమా దసరాకు రావడం లేదట. దేనికైనా మంచిదని ముందుగానే దసరాకు వస్తున్నట్టు ప్రకటించారట. అంతేతప్ప దసరాకు వచ్చే ఉద్దేశం చెర్రీకి కానీ, సురేందర్ రెడ్డికి గానీ, వీళ్లకంటే ముందు నిర్మాత అల్లు అరవింద్ కు కానీ అస్సలు లేదట . ఎందుకంటే.. దసరాకు విడుదలయ్యే రేంజ్ లో ధృవ సినిమా […]

Advertisement
Update:2016-09-05 07:16 IST

నిజంగా దసరాకు రావాలనుకుంటే ఈపాటికే కాస్త హడావుడి ప్రారంభం కావాలి. షూటింగ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా జరగాలి. కానీ రామ్ చరణ్ నటిస్తున్న ధృవ సినిమా దసరాకు రావడం లేదట. దేనికైనా మంచిదని ముందుగానే దసరాకు వస్తున్నట్టు ప్రకటించారట. అంతేతప్ప దసరాకు వచ్చే ఉద్దేశం చెర్రీకి కానీ, సురేందర్ రెడ్డికి గానీ, వీళ్లకంటే ముందు నిర్మాత అల్లు అరవింద్ కు కానీ అస్సలు లేదట . ఎందుకంటే.. దసరాకు విడుదలయ్యే రేంజ్ లో ధృవ సినిమా షూటింగ్ జరగడం లేదని తెలుస్తోంది.

కేవలం మార్కెట్ ను పెంచుకునేందుకు, బిజినెస్ ను డబుల్ చేసుకునేందుకే దసరాకు వస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారని తెలుస్తోంది. ఎందుకంటే దసరా బరిలో ఓ మెగా సినిమా ఉందంటే కచ్చితంగా దానికి రేటు ఇంకాస్త ఎక్కువ పలుకుతుంది. సినిమా మెగాహీరోది కావడం, పైగా పండగ సీజన్ లో రావడంతో కచ్చితంగా కాసులు కురుస్తాయనే ఆశతో కాస్త ఎక్కువ మొత్తానికే సినిమాను కొంటారు. అందుకే కావాలనే నిర్మాత అల్లు అరవింద్, ధృవ సినిమాను దసరాకు తీసుకొస్తున్నట్టు ప్రకటించి బిజనెస్ ప్రారంభించారట.

అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే చిత్రానికి సంబందించిన టాకీ పార్ట్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకావాలి. కానీ అలా జరగలేదు. టాకీ పార్ట్ తో పాటు 3 పాటలు బ్యాలెన్స్, అరవింద్ స్వామిపై తీయాల్సిన ముఖ్యమైన సన్నివేశాలు ఇంకా మిగిలే ఉన్నాయట. దీంతో హడావుడిగా సినిమాని చుట్టేసే ప్రయత్నం కాకుండా లేటైనా కాస్త టైమ్ తీసుకుని పక్కాగా పూర్తిచేయాలని నిర్మాత అల్లు అరవింద్ అనుకుంటున్నాడట. కనుక ఈ చిత్రం దసరా బరిలో కాకుండా దీపావళి బరిలో నిలిచేలా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News