జనతా గ్యారేజ్ కు వర్షం దెబ్బ

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా జనతా గ్యారేజ్ సినిమా విడుదలకానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేరళ, కర్నాటక, నార్త్, ఓవర్సీస్ లో జనతా గ్యారేజ్ రేపు అట్టహాసంగా విడుదలకానుంది. అయితే అనుకోకుండా కురిసిన భారీ వర్షాలు జనతా గ్యారేజ్ కు అడ్డంకిగా మారాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు జనతా గ్యారేజ్ వసూళ్లపై పెను ప్రభావం చూపే ప్రమాదముందని ట్రేడ్ పండిట్స్ లెక్కలేస్తున్నారు. నైజాంలో కీలక ప్రాంతం హైదరాబాద్ ఒక్కటే. ఈ ఏరియాలో […]

Advertisement
Update:2016-08-31 12:09 IST

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా జనతా గ్యారేజ్ సినిమా విడుదలకానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేరళ, కర్నాటక, నార్త్, ఓవర్సీస్ లో జనతా గ్యారేజ్ రేపు అట్టహాసంగా విడుదలకానుంది. అయితే అనుకోకుండా కురిసిన భారీ వర్షాలు జనతా గ్యారేజ్ కు అడ్డంకిగా మారాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు జనతా గ్యారేజ్ వసూళ్లపై పెను ప్రభావం చూపే ప్రమాదముందని ట్రేడ్ పండిట్స్ లెక్కలేస్తున్నారు.

నైజాంలో కీలక ప్రాంతం హైదరాబాద్ ఒక్కటే. ఈ ఏరియాలో వచ్చిన వసూళ్ల మీదే నైజాం కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. పైగా జనతా గ్యారేజ్ సినిమా హైదరాబాద్ లో దాదాపు 120 స్క్రీన్స్ పై విడుదలకు సిద్ధమైంది. అయితే భాగ్యనగరంలో అనుకోకుండా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం సరిగ్గా 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షాలు దాదాపు సాయంత్రం 6గంటల వరకు ఏదో ఒక చోటు కురుస్తూనే ఉన్నాయి. రేపు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జనతా గ్యారేజ్ వసూళ్లపై అది ప్రభావం చూపించకతప్పదు.

అయితే సినిమా విడుదలైన మొదటి 3 రోజులు మాత్రం హైదరాబాద్ లో ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. సినిమాకు సంబంధించి చాలా థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అయిపోయాయి. అయినప్పటికీ వర్షాలు తగ్గితే అది జనతా గ్యారేజ్ కు మంచి లాభాలు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News