రేవంత్ రెడ్డి త్రీడీ జోక్!

తెలంగాణ వ‌చ్చాక రాష్ర్టాన్ని లోటుబ‌డ్జెట్ దిశ‌గా ప్ర‌యాణింప జేస్తున్నార‌ని సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. తెలంగాణ అభివృద్ధి మొత్తం త్రీడీలోనే క‌నిపిస్తోంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై ఒంటికాలిపై లేచే తెలంగాణ రాష్ర్ట స‌మితి నేత‌లు ఈ సారి మాత్రం పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్నారు. అదిగో.. అమ‌రావ‌తి.. ఇదిగో! అమ‌రావ‌తి అంటూ అర‌చేతిలో త్రీడీ ప్ర‌పంచాన్ని చూపిస్తోన్న ఏపీ సీఎం బాబును ప‌క్క‌న బెట్టి క్షేత్ర‌స్థాయిలో ప‌నులు […]

Advertisement
Update:2016-08-22 02:30 IST
తెలంగాణ వ‌చ్చాక రాష్ర్టాన్ని లోటుబ‌డ్జెట్ దిశ‌గా ప్ర‌యాణింప జేస్తున్నార‌ని సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. తెలంగాణ అభివృద్ధి మొత్తం త్రీడీలోనే క‌నిపిస్తోంద‌ని.. క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై ఒంటికాలిపై లేచే తెలంగాణ రాష్ర్ట స‌మితి నేత‌లు ఈ సారి మాత్రం పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్నారు. అదిగో.. అమ‌రావ‌తి.. ఇదిగో! అమ‌రావ‌తి అంటూ అర‌చేతిలో త్రీడీ ప్ర‌పంచాన్ని చూపిస్తోన్న ఏపీ సీఎం బాబును ప‌క్క‌న బెట్టి క్షేత్ర‌స్థాయిలో ప‌నులు చేసి చూపెడుతున్న కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డం ఏంట‌ని న‌వ్వుకుంటున్నారు?. కేసీఆర్ చేసే ప్ర‌తిప‌నిని ఏపీలో మ‌క్కీకి మ‌క్కీ కాపీ కొడుతూ.. పైగా వాటిని సొంత ప‌థ‌కాలుగా చంద్రబాబు చెప్పుకుంటున్న సంగ‌తి నీకు తెలియ‌దా? అని రేవంత్ రెడ్డిని చూసి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు టీఆర్ ఎస్ నాయ‌కులు.
నిరంత‌రం ప్ర‌త్య‌ర్థుల‌పై నోరుపారేసుకునే అల‌వాటున్న రేవంత్.. ఇలాంటి జోకులు పేల్చడాన్ని తాము ఎంతో ఆస్వాదిస్తున్నామ‌ని అంటున్నారు. ఒక‌వైపు క‌డుతుంటే..మ‌రో వైపు కూలిపోతున్న అమ‌రావ‌తి నిర్మాణాలే నిజ‌మైన త్రీడీ నిర్మాణాల‌ని ఎగ‌తాళి చేస్తున్నారు. మీ సీఎం నిర్మిస్తోన్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి త్రీడీ డిజైన్లు చూసి పాకిస్తాన్ భ‌య‌ప‌డిపోయిన విష‌యాన్ని మ‌రిచిపోయావా ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు టీడీపీ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి స్వ‌ర్ణాంధ్ర అంటూ ప‌దేళ్లు, ఇప్పుడు అమ‌రావ‌తి పేరుతో మ‌రో కొంత‌కాలం త్రీడీలో ప్ర‌చారం చేసుకుంటున్న‌ది ఎవ‌రో? అంద‌రికీ తెలుస‌ని న‌వ్వుకుంటున్నారు గులాబీనేత‌లు.
Tags:    
Advertisement

Similar News