ప్రేక్షకుల సహనంతో "ఆటాడుకున్నాడు..!"

ఫ్రాంక్ గా చెప్పుకుంటే  కొన్ని విష‌యాలు చేదుగా అనిపిస్తాయి.    ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా   క‌థ లేకుండా  సినిమా చేస్తే   ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేయ‌డం క‌ష్టం.   జి నాగేశ్వ‌రెడ్డి వంటి   సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు  సినిమా అంటే   మంచి క‌థ‌నంతో  ఆడియ‌న్స్ ను  క‌డుపుబ్బా న‌వ్విస్తాడ‌నే ఒక న‌మ్మ‌కం ఉంది. కానీ సుశాంత్  తో చేసిన ఆటాడుకుందాం రా చిత్రం చూస్తే..  ఇది అస‌లు ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌రెడ్డి చేసిన చిత్ర‌మేనా… క‌థ […]

Advertisement
Update:2016-08-19 08:41 IST
ఫ్రాంక్ గా చెప్పుకుంటే కొన్ని విష‌యాలు చేదుగా అనిపిస్తాయి. ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా క‌థ లేకుండా సినిమా చేస్తే ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేయ‌డం క‌ష్టం. జి నాగేశ్వ‌రెడ్డి వంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సినిమా అంటే మంచి క‌థ‌నంతో ఆడియ‌న్స్ ను క‌డుపుబ్బా న‌వ్విస్తాడ‌నే ఒక న‌మ్మ‌కం ఉంది. కానీ సుశాంత్ తో చేసిన ఆటాడుకుందాం రా చిత్రం చూస్తే.. ఇది అస‌లు ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌రెడ్డి చేసిన చిత్ర‌మేనా… క‌థ లేకుండా.. ఏమి చేయాలో పాలు పోక‌.. దారుణంగా సాగిదిసిన‌ట్లు అనిపిస్తుది.
ఫ్రెండ్ షిప్ ను హైలెట్ చేస్తూ ఫ్యామిలి, ల‌వ్ సెంటెమెంట్ ను ఇంట‌ర్న‌ల్ గా చూపించాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. క‌థ , క‌థ‌నాలు దారుణంగా ఉండ‌టంతో సినిమా చూస్తున్న ఆడియ‌న్స్ నిద్ర‌లోకి జారుకుంటున్నారు. ఇక సుశాంత్ లుక్ వ‌రుకు కొత్త‌గా అనిపించిన‌ప్పటికి.. డైలాగ్ ప‌లక‌డం ఇంకా ఇంప్రూవ్ కానే లేద‌నిస్తుది. కొత్త‌మ్మాయి సోన‌మ్ ప‌ర‌వాలేద‌నిపిస్తుంది. అనూప్ రూబెన్స్ ట్యూన్స్ జ‌స్ట్ ఓకే. ఇక చిత్రంలో నాగ‌చైత‌న్య‌, అఖిల్ లు క‌నిపించి ఆడియ‌న్స్ ను ఆశ్చ‌ర్య ప‌రుద్దామ‌నుకున్నా.. క‌థ‌లో ద‌మ్ము లేక పోవ‌డంతో వాళ్లు క‌నిపించినా..పెద్ద‌గా ఏమి అనిపించందు. ఓవ‌రాల్ గా ఆటాడుకుందాం రా.. ఆడియ‌న్స్ పేష‌న్స్ తో ఆటాడుకునే చిత్రంగా మిగిలిపోయో సినిమానే.
Tags:    
Advertisement

Similar News