హృతిక్ తెరమీదే కాదు.. తెర వెనక కూడా ఇంతే..!
బాలీవుడ్ లో 6 ప్యాక్స్ తో చాల కాలం సల్మాన్ ఖాన్ కు ఎదురే లేని హీరోగా చెలామణి అయిన విషయం తెలిసిందే. అయితే హృతిక్ రోషన్ ఎంట్రీ తర్వాత.. ఆయన కండల్ని చూసి యూత్ జిమ్మ్ లకు పరిగెత్తి 6 ప్యాక్ లు పెంచరంటే అంటే అతిశయోక్తి కాదు. కహానో ప్యార్ హై చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన హృతిక్ తన ఫిజక్ , ఫిజకల్ లుక్ తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. […]
బాలీవుడ్ లో 6 ప్యాక్స్ తో చాల కాలం సల్మాన్ ఖాన్ కు ఎదురే లేని హీరోగా చెలామణి అయిన విషయం తెలిసిందే. అయితే హృతిక్ రోషన్ ఎంట్రీ తర్వాత.. ఆయన కండల్ని చూసి యూత్ జిమ్మ్ లకు పరిగెత్తి 6 ప్యాక్ లు పెంచరంటే అంటే అతిశయోక్తి కాదు. కహానో ప్యార్ హై చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన హృతిక్ తన ఫిజక్ , ఫిజకల్ లుక్ తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తన ఫస్ట్ పిల్మ్ కహోనా ప్యార్ హై.. ఆ తరువాత చేసిన క్రిష్ చిత్రాలు ఈ కండల వీరుడికి లేడి ఫ్యాన్స్ ను బాగా పెంచేశాయి.
ఇక తాజగా ‘మొహంజదారో’ అనే చిత్రంతో ఆడియన్స్ ను అలరించడానికి సిద్దం అయ్యారు. అయితే తెరపైనే కాదు… బయట కూడా సూపర్‌మేన్‌ని గుర్తుకు తెచ్చే రూపంతో కనిపిస్తుంటాడు హృతిక్‌రోషన్. అందుకే హృతిక్ అమ్మాయిల కలల కథానాయకుడైపోయాడు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో ఒకరు. ఆయన తండ్రి రాకేష్ రోషన్ దర్శకుడు. మొహంజదారో మన నాగరికత లో భాగం. మరి మన నాగరికత లో ఒక ముఖ్యనగరమైన మొహంజదారో నేపథ్యంగా హృతిక్ ఏం చేశాడు.. ? అప్పటి నాగరికత ను దర్శకుడు అశుతోష్ గోవరికర్ ఎలా చూపించాడు. ఏ అంశాలు ఎక్కువుగా ఫోకస్ చేశారు. ఆ విశేషాలన్ని తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.ఈ చిత్రంలో హృతిక్ సరసన పూజ హెగ్డె నటిస్తున్న విషయం తెలిసెందే. ఈ చిత్రం హిట్ అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం లేక పోలేదు మరి.