మోదీ దృష్టికి చంద్రబాబు "అతి"వ్యవహారాలు

చంద్రబాబు అతి వ్యవహారాలపై భారత విదేశాంగశాఖ సీరియస్‌ అయిందట. రెండేళ్లక్రితం చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్ననాటినుంచి విదేశీపర్యటనలు అతిగా చేయడం, ఆ దేశాలతో ఒక ప్రధాని వ్యవహరించిన తీరులో వ్యవహరిస్తుండటం విదేశాంగ శాఖకు చిరాకుగా వుందట. చంద్రబాబు ప్రొటోకాల్‌ మరిచిపోయి ఇష్టమొచ్చినట్లు విదేశాలకు వెళుతుండడం, అడ్డదిడ్డంగా ఒప్పందాలు చేసుకోవడం, ప్రెస్‌మీట్లు పెట్టి దేశ ప్రధాని స్థాయిలో మాట్లాడడం, దేశాధినేతలను కలిసి వాళ్లను ఇండియాకు ఆహ్వానించడం మొదలైనవి భారత విదేశాంగశాఖకు అంతుపట్టడం లేదట. తాజాగా రష్యాలో జరిగిన […]

Advertisement
Update:2016-07-15 06:24 IST

చంద్రబాబు అతి వ్యవహారాలపై భారత విదేశాంగశాఖ సీరియస్‌ అయిందట. రెండేళ్లక్రితం చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్ననాటినుంచి విదేశీపర్యటనలు అతిగా చేయడం, ఆ దేశాలతో ఒక ప్రధాని వ్యవహరించిన తీరులో వ్యవహరిస్తుండటం విదేశాంగ శాఖకు చిరాకుగా వుందట.
చంద్రబాబు ప్రొటోకాల్‌ మరిచిపోయి ఇష్టమొచ్చినట్లు విదేశాలకు వెళుతుండడం, అడ్డదిడ్డంగా ఒప్పందాలు చేసుకోవడం, ప్రెస్‌మీట్లు పెట్టి దేశ ప్రధాని స్థాయిలో మాట్లాడడం, దేశాధినేతలను కలిసి వాళ్లను ఇండియాకు ఆహ్వానించడం మొదలైనవి భారత విదేశాంగశాఖకు అంతుపట్టడం లేదట.
తాజాగా రష్యాలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో వెళ్లిన బృందంలో ఒక సభ్యుడు చంద్రబాబు. కానీ ఆయన రష్యాలో అలా వ్యవహరించలేదు. తానే నాయకుడిగా ప్రవర్తించి రష్యా అధ్యక్షుడి మెద్వదేవ్‌ను భారత్‌కు రావాలని ఆహ్వానించాడు. ఇది భారత విదేశాంగశాఖకు చాలా చికాకు కలిగించింది.

గతంలో కూడా చైనా వెళ్లినప్పుడు బుల్లెట్‌ ట్రైన్స్‌ను అమరావతిలో నడిపేలా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేయడం, అస్తానా మేయర్‌తో విమాన రాకపోకల ఒప్పందాలగురించి మాట్లాడడం, సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందాలు ఇవన్నికేంద్రానికి మండిపోయేలా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా మీడియా ఇమేజ్‌ వల్ల ఈయన ఏదో గొప్పనాయకుడని ఊహించుకున్న వాళ్లు ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసి ఈయనకేమైందని మాట్లాడుకుంటున్నారట. అంతటితో ఆగకుండా కేంద్ర అధికారులు తమ అసంతృప్తిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేశారని వార్తలొచ్చాయి. చంద్రబాబు ఈ అతి వ్యవహారాలకు ఇక చెక్‌ పెట్టకపోతే అనేక ఇబ్బందులోస్తాయని భావించి విషయాన్నితాజాగా ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లారని చెబుతున్నారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News