హరిత హారంలోఐటీ ఉద్యోగులు
*వానలు రావాలె.. కోతులు వాపస్ పోవాలె* నినాదంతో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన హరితహారం నగరంలో జోరుగా సాగుతోంది. ప్రజా ఉద్యమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండే ఐటీ ఉద్యోగులు ఈ హరితహారంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరుస్తున్నారు. ఐటీ, పంచాయత్‌రాజ్, పురపాలక మంత్రి కే తారక రామారావు టీసీఎస్ క్యాంపస్‌లో ఐటీ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్‌తోపాటే క్యాంపస్‌లో ఉద్యోగులు వేలాది మంది మొక్కలు నాటారు. హైటెక్ సిటీలోని వీధులు, పలు కంపెనీల […]
Advertisement
*వానలు రావాలె.. కోతులు వాపస్ పోవాలె* నినాదంతో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన హరితహారం నగరంలో జోరుగా సాగుతోంది. ప్రజా ఉద్యమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండే ఐటీ ఉద్యోగులు ఈ హరితహారంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరుస్తున్నారు. ఐటీ, పంచాయత్‌రాజ్, పురపాలక మంత్రి కే తారక రామారావు టీసీఎస్ క్యాంపస్‌లో ఐటీ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్‌తోపాటే క్యాంపస్‌లో ఉద్యోగులు వేలాది మంది మొక్కలు నాటారు. హైటెక్ సిటీలోని వీధులు, పలు కంపెనీల క్యాంపస్‌లలో ఉద్యోగులు మొక్కలునాటి హరితహారంలో పాల్గొన్నారు. దీనితోపాటుగా 25 లక్షల మొడిసిన్ ప్లాంట్‌లను హైటెక్ సిటీలో సోమవారం పంపిణీ చేశారు.ఇళ్లలో పెంచుకునేందుకు ఉద్యోగులకు ఈ మొక్కలను అందజేశారు. సోమవారం నాటి హరితహారంలో బీహెచ్ ఈఎల్‌లో గవర్నర్ నరసింహతన్‌తోపాటుగా కేటీఆర్ కూడా పాల్గొని మొక్కలు నాటారు
Advertisement