మొదటి షెడ్యూల్ పూర్తిచేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం కత్తిలాంటోడు. ఎన్నో ఎదురుచూపుల మధ్య వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈమధ్యే ఈ సినిమా పట్టాలపైకి వచ్చింది. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడమే ఆలస్యం… సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు హీరో చిరంజీవి. ఇందులో భాగంగా కళ్లముందే మొదటి షెడ్యూల్ ను పూర్తిచేశాడు. రామోజీఫిలింసిటీ, రామానాయుడు స్టుడియోస్ తో పాటు… హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. ఇక రెండో షెడ్యూల్ ను ఈనెల 15 నుంచి ప్రారంభించాలని […]

Advertisement
Update:2016-07-11 07:10 IST

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం కత్తిలాంటోడు. ఎన్నో ఎదురుచూపుల మధ్య వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈమధ్యే ఈ సినిమా పట్టాలపైకి వచ్చింది. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడమే ఆలస్యం… సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు హీరో చిరంజీవి. ఇందులో భాగంగా కళ్లముందే మొదటి షెడ్యూల్ ను పూర్తిచేశాడు. రామోజీఫిలింసిటీ, రామానాయుడు స్టుడియోస్ తో పాటు… హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. ఇక రెండో షెడ్యూల్ ను ఈనెల 15 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా… మేకింగ్ లో తమదైన ముద్ర వేసిన చిరంజీవి, ఇప్పుడు ఎడిటింగ్ ను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడట. ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేసిన సన్నివేశాలకు సంబంధించిన ఎడిటింగ్ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొంటున్నాడు. ఎడిటింగ్ లో సరిగా లేని సన్నివేశాల్ని తొలిగిస్తున్నాడట. అవసరమైతే మొదటి షెడ్యూల్ లో తీసిన కొన్ని సన్నివేశాల్ని, రెండో షెడ్యూల్ లో రీషూట్ చేయాలని వినాయక్ ను ఆదేశిస్తున్నాడట. మరోవైపు ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్… ఇప్పటికే కత్తిలాంటి 3 పాటల్ని సిద్ధంచేశాడు. వీటిలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు… ఐటెంసాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. మరోవైపు హీరోియన్ తో వచ్చే ఓ డ్యూయట్ ను కూడా కంపోజ్ చేశాడట. సినిమాలో హీరోయిన్ ఎవరనేది కన్ ఫర్మ్ అయిన వెంటనే… సాంగ్స్ షూటింగ్ ప్రారంభిస్తారు.

Tags:    
Advertisement

Similar News