స్మృతి ఇరానీ అందుకే తప్పించారా?
కేంద్ర మానవ వనరుల శాఖామంత్రిగా స్మృతి ఇరానీని తప్పించడం సంచలనంగా మారింది. ఆమె విద్యార్హత, రోహిత్ వేముల ఆత్మహత్య, ఢిల్లీ యూనివర్సిటీల్లో విద్యార్థుల అరెస్టులు తదితరాలు ఆమెను కీలకమైనశాఖ నుంచి తప్పించేలా చేశాయనిపిస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమెను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుకోవడం ఒక సంచలనం! ఆ తరువాత ఆమెకు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవ వనరుల శాఖను కేటాయించడం మరో సంచలనానికి కారణమైంది. దీనిని సంచలనం అనే కంటే.. వివాదం చెలరేగిందంటే.. బాగుంటుంది. అస్సలు ఇంటర్ […]
Advertisement
కేంద్ర మానవ వనరుల శాఖామంత్రిగా స్మృతి ఇరానీని తప్పించడం సంచలనంగా మారింది. ఆమె విద్యార్హత, రోహిత్ వేముల ఆత్మహత్య, ఢిల్లీ యూనివర్సిటీల్లో విద్యార్థుల అరెస్టులు తదితరాలు ఆమెను కీలకమైనశాఖ నుంచి తప్పించేలా చేశాయనిపిస్తోంది.
రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమెను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుకోవడం ఒక సంచలనం! ఆ తరువాత ఆమెకు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవ వనరుల శాఖను కేటాయించడం మరో సంచలనానికి కారణమైంది. దీనిని సంచలనం అనే కంటే.. వివాదం చెలరేగిందంటే.. బాగుంటుంది. అస్సలు ఇంటర్ మాత్రమే చదివిన ఆమెకు ఉన్నత విద్యా వ్యవహారాలకు సంబంధించిన శాఖను ఎలా అప్పగిస్తారంటూ.. అప్పట్లో విపక్షాలు నరేంద్ర మోదీ సర్కారుపై దుమ్మెత్తి పోశాయి. వీటిపై పెద్దగా స్పందించలేదు ఎన్డీఏ సర్కారు. డిగ్రీలు లేకపోతేం ఏంటి? అన్న కోణంలో సమర్ధించుకున్నారు. కేంద్రం ఆత్మరక్షణలో పడటంతో పలువురు సమాచార హక్కు కింద ఆమె విద్యార్హతలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరడం మొదలు పెట్టారు.
స్మృతి ఇరానీ వివాదాలు ఇవే!
1. విపక్షాల నుంచి దాడి తీవ్రం కావడంతో తనకు డిగ్రీ ఉందని ఆమె స్వయంగా ప్రకటించడంతో గొడవ సద్దుమణిగినా.. అది తాత్కాలికమే అయింది.
2. దేశంలో కీలకమైన కేంద్రియ విద్యాలయాల్లో క్రిస్‌మస్ సెలవు దినాన్ని రద్దు చేయాలని చూశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
వాజ్ పెయి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మాత్రమే పెడుతున్నామని వివరణ ఇచ్చుకున్నారు.
3. కేంద్రియ విద్యాలయాల్లో జర్మన్ స్థానంలో సంస్మృతాన్ని ప్రవేశ పెట్టడంపై తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అక్కడ కోర్టు తల్లిదండ్రులకు మద్దుతుగా తీర్పు ఇచ్చింది. దీంతో 2014-15 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మినహాయింపు దక్కింంది.
4. దీనికితోడు ఆమె తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
5. ఇటీవల హైదరాబాద్‌లో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతంలోనూ ఆమె అతిగా జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు, ఢిల్లీ యూనివర్సిటీల్లో విద్యార్థులపై దేశ ద్రోహం కేసునమోదు విషయం కూడా బాగా ప్రభావం చూపింది.
6. తరువాత అన్ని యూనివర్సిటీలు, కేంద్రియ విద్యాలయాలు, నవోదయా విద్యాలయాల్లో ప్రతిరోజు జాతీయ జెండా ఎగరేయాలన్న ఆదేశాలు సైతం తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటన్నింటి దృష్ట్యా ఆమె దళిత వ్యతిరేకి అన్నముద్ర గట్టిగా పడింది. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో దళితుల ఓట్లు సాధించేందుకు కంటితుడుపు చర్యగా ఆమెను తప్పించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement