మోసపోయిన మహేష్‌బాబు అభిమాని

హీరో మహేష్‌బాబు అంటే ఉన్న పిచ్చ అభిమానంతో ఒక యువకుడు మోసపోయాడు. మహేష్‌బాబు దగ్గరకు తీసుకెళ్తానని ఒక వ్యక్తి చెప్పగా నమ్మి సొమ్ము సమర్పించుకున్నాడు. మహేష్‌బాబుకు వీరఅభిమాని అని బాధితుడికి ఫేస్‌బుక్ ద్వారా శశి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను మహేష్‌కు చాలా దగ్గరి మనిషినని నమ్మించారు. తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మహేష్‌బాబును కలుస్తుంటానని నమ్మించాడు. తనను తీసుకెళ్లాలని బాధితులు కోరగా అందుకు శశి ఓకే అన్నాడు. అయితే ఖర్చులకు రూ. 5వేలు తన […]

Advertisement
Update:2016-07-05 11:31 IST

హీరో మహేష్‌బాబు అంటే ఉన్న పిచ్చ అభిమానంతో ఒక యువకుడు మోసపోయాడు. మహేష్‌బాబు దగ్గరకు తీసుకెళ్తానని ఒక వ్యక్తి చెప్పగా నమ్మి సొమ్ము సమర్పించుకున్నాడు. మహేష్‌బాబుకు వీరఅభిమాని అని బాధితుడికి ఫేస్‌బుక్ ద్వారా శశి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను మహేష్‌కు చాలా దగ్గరి మనిషినని నమ్మించారు. తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మహేష్‌బాబును కలుస్తుంటానని నమ్మించాడు.

తనను తీసుకెళ్లాలని బాధితులు కోరగా అందుకు శశి ఓకే అన్నాడు. అయితే ఖర్చులకు రూ. 5వేలు తన ఖాతాలో వేయాలని సూచించారు. మహేష్‌ బాబు మీద ఉన్న అభిమానంతో బాధితుడు వెనుకాముందు చూసుకోకుండా శశి అకౌంట్లో రూ. 5వేలు వేసేశాడు. ఆ తర్వాత ఫోన్‌ చేస్తే స్విచ్చాప్‌. ఫేస్‌బుక్‌లో నో రిప్లే. దీంతో మోసపోయానని మహేష్‌బాబు అభిమానికి అర్థమైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News