మా నాన్నకు ఆ దౌర్భాగ్య స్థితి వచ్చింది...

ప్రతిపక్షనేత జగన్‌ తరహాలో తప్పులు చేసి జైలుకు వెళ్లాలనే కోరిక తనకు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేసే నాయకులు వాటిని రుజువు చేయాలని సవాల్ చేశారు. రంజాన్ సందర్బంగా విజయవాడలో ముస్లింలకు రంజాన్‌ తోఫా కానుకలను నారా లోకేష్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన తన తండ్రి చంద్రబాబు రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. 67ఏళ్ల వయసులో 16ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని […]

Advertisement
Update:2016-06-29 10:47 IST

ప్రతిపక్షనేత జగన్‌ తరహాలో తప్పులు చేసి జైలుకు వెళ్లాలనే కోరిక తనకు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేసే నాయకులు వాటిని రుజువు చేయాలని సవాల్ చేశారు. రంజాన్ సందర్బంగా విజయవాడలో ముస్లింలకు రంజాన్‌ తోఫా కానుకలను నారా లోకేష్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన తన తండ్రి చంద్రబాబు రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.

67ఏళ్ల వయసులో 16ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. తన తండ్రి ఇటీవల ఇంటికి వచ్చేసరికి రాత్రి 10గంటలు దాటుతోందన్నారు. ప్రతిఒక్కరికి మనవడితో ఆడుకోవాలని ఉంటుందని కానీ తన తండ్రికి ఆ అవకాశం కూడా ఉండడం లేదన్నారు. తన తండ్రి మనవడిని చూసి నెల రోజులైందన్నారు. ”అధికారులతో మాట్లాడేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టుగానే మనవడిని కూడా వీడియో కాన్ఫరెన్స్‌లోనే చూడాల్సిన దౌర్భాగ్యస్థితి ఆయనకు వచ్చింది” అని లోకేష్ అన్నారు. దేశంలో ఏ ఒక్కరికి రాని విధంగా రాజధాని నిర్మించే అద్భుత అవకాశాన్ని తన తండ్రికి జనం ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు లోకేష్. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న గత ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చిన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందన్నారు.

https://youtu.be/EISXOOhWRqY?t=1m11s

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News