ఉలిక్కి పడ్డ ఏలూరు... కూరపాటి నాగరాజుపై మళ్లీ కాల్పులు
2014 సెప్టెంబర్లో కృష్ణా జిల్లా పెదఅవుటపల్లి జాతీయ రహదారిపై పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను కాల్చి చంపిన ఘటన చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. తుపాకులతో వచ్చి జాతీయ రహదారిపై జ్యోతిష్యుడి కుటుంబాన్ని కాల్చి చంపడం సంచలనం సృష్టించింది. హత్యలు చేయించింది కూడా సమీపబంధువులేనని తేల్చారు. కొందరిని అరెస్ట్ కూడా చేశారు. అయితే వారి కక్షలు ఇంకా చల్లారలేదు. తాజాగా మంగళవారం రాత్రి ఏలూరులో కూరపాటి నాగరాజుపై ప్రత్యర్థులు […]
2014 సెప్టెంబర్లో కృష్ణా జిల్లా పెదఅవుటపల్లి జాతీయ రహదారిపై పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను కాల్చి చంపిన ఘటన చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. తుపాకులతో వచ్చి జాతీయ రహదారిపై జ్యోతిష్యుడి కుటుంబాన్ని కాల్చి చంపడం సంచలనం సృష్టించింది. హత్యలు చేయించింది కూడా సమీపబంధువులేనని తేల్చారు. కొందరిని అరెస్ట్ కూడా చేశారు. అయితే వారి కక్షలు ఇంకా చల్లారలేదు. తాజాగా మంగళవారం రాత్రి ఏలూరులో కూరపాటి నాగరాజుపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. గతేడాది కూడా ఇతడిపై ప్రత్యర్థులు హైదరాబాద్‌లో కాల్పులు జరిపారు. అప్పట్లో తృటిలో తప్పించుకున్నారు. తాజాగా జరిగిన కాల్పుల దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఏలూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. ప్రత్యర్థులకు భయపడి కొంతకాలంగా నాగరాజు అజ్ఞాతంలో ఉన్నారు.
గతంలో పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో గంధం నాగేశ్వరరావు, ఏలూరులోని జేకే ప్యాలెజ్ యజమాని భూతం దుర్గారావు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో భూతం దుర్గారావును గంధం ప్యామిలీ హత్య చేసింది. ఈ హత్య కేసులో కూరపాటి నాగరాజు కూడా ప్రధాన నిందితుడు. దుర్గారావు హత్యకు ప్రతికారంగా లండన్లో ఉంటున్న అతడి సోదరుడు గోవింద్ కోటి రూపాయల సుపారీ ఇచ్చి కిరాయి హంతకులను రంగంలోకి దింపారు. వారే 2014 సెప్టెంబర్‌లో పెద అవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వరరావు, అతడి కుమారులు మారయ్య, పగిడి మారయ్యలను కాల్చి చంపేశారు. తమ అన్న హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కూరపాటి నాగరాజును హత్య చేసేందుకు దుర్గరావు సోదరులు సిద్దమయ్యారు. గతేడాది సరూర్‌నగర్‌లో అటాక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఏలూరులో తుపాకులతో కాల్పులు జరిపారు.
Click on Image to Read: