ఉడ్తా పంజాబ్ కు లైన్ క్లియర్

పంజాబ్ లోని డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఉడ్తా పంజాబ్ సినిమాకు మార్గం సుగమం అయింది. ఈసినిమాకు మొదట 89 కట్స్ సూచించింది సెన్సార్ బోర్డ్. తర్వాత కోర్టు కేసు పడ్డంతో… 13 కట్స్ తో ఎ-సర్టిఫికేట్ ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు ఆ 13 కట్స్ కూడా తొలిగించింది. దీంతో ఉడ్తా పంజాబ్ చుట్టూ ముసురుకున్న మబ్బులు తొలిగిపోయాయి. దీని చుట్టూ అంటుకున్న రాజకీయ బురద వదిలింది.  దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ఉడ్తాపంజాబ్‌ […]

Advertisement
Update:2016-06-14 05:03 IST
పంజాబ్ లోని డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఉడ్తా పంజాబ్ సినిమాకు మార్గం సుగమం అయింది. ఈసినిమాకు మొదట 89 కట్స్ సూచించింది సెన్సార్ బోర్డ్. తర్వాత కోర్టు కేసు పడ్డంతో… 13 కట్స్ తో ఎ-సర్టిఫికేట్ ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు ఆ 13 కట్స్ కూడా తొలిగించింది. దీంతో ఉడ్తా పంజాబ్ చుట్టూ ముసురుకున్న మబ్బులు తొలిగిపోయాయి. దీని చుట్టూ అంటుకున్న రాజకీయ బురద వదిలింది.
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ఉడ్తాపంజాబ్‌ సెన్సార్‌షిప్‌పై సెన్సార్‌బోర్డుకు వ్యతిరేకంగా చిత్రబృందం వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సినిమాలో ఒక్క కట్‌, రెండు మార్పులు చేస్తే సరిపోతుందని సెన్సార్‌బోర్డుకు న్యాయస్థానం సూచించింది. భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే సన్నివేశాలేవీ సినిమాలో లేవని కోర్టు స్పష్టం చేసింది.
ఉడ్తాపంజాబ్‌ సినిమాపై గతకొంతకాలంగా వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. సినిమాలో 89 సీన్లను తొలగించాలని సెన్సార్‌బోర్డు సూచించింది. దీంతో చిత్రబృందం కోర్టును ఆశ్రయించగా.. పై విధంగా తీర్పు చెప్పింది. ఇదిలా ఉండగా.. సినిమాకు ఏ సర్టిఫికెట్‌ ఇస్తున్నట్లు సెన్సార్‌బోర్డు ఇప్పటికే ప్రకటించింది. చిత్రంలో 13 సీన్లను తొలగించాలని సూచించింది. సర్టిఫికెట్‌ ఇవ్వడంతో సెన్సార్‌బోర్డు పని అయిపోయిందని.. ఇక కోర్టుకు వెళ్లడమా లేదా అన్నది ప్రొడ్యూసర్‌ ఇష్టమని బోర్డు చీఫ్‌ నిహలానీ అన్నారు.
Tags:    
Advertisement

Similar News