ఇలాంటి మొగుడు తనకొద్దంటున్న రాశి ఖన్నా

రాశిఖన్నా-సాయిధరమ్ తేజ మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అంటూ కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. సుప్రీమ్ సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ అదిరిపోవడంతో పాటు… చాలా క్లోజ్ గా కనిపిస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా ఈ పుకార్లకు కారణమైంది. అయితే సాయి అంటే తనకు ఏమాత్రం ఇష్టంలేదని ఇండైరెక్ట్ గా చెప్పేసింది రాశిఖన్నా. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిని తను పెళ్లి చేసుకోనని కాస్త సూటిగానే చెప్పేసింది. సుప్రీం సినిమా ప్రమోషన్ లో […]

Advertisement
Update:2016-06-13 05:33 IST
రాశిఖన్నా-సాయిధరమ్ తేజ మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అంటూ కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. సుప్రీమ్ సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ అదిరిపోవడంతో పాటు… చాలా క్లోజ్ గా కనిపిస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా ఈ పుకార్లకు కారణమైంది. అయితే సాయి అంటే తనకు ఏమాత్రం ఇష్టంలేదని ఇండైరెక్ట్ గా చెప్పేసింది రాశిఖన్నా.
ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిని తను పెళ్లి చేసుకోనని కాస్త సూటిగానే చెప్పేసింది. సుప్రీం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రాశిఖన్నా… తన వ్యక్తిగత విషయాల్ని కూడా పంచుకుంది. తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పిన రాశిఖన్నా… ఆ ఇష్యూలోకి పక్కనే ఉన్న సాయిధర్మతేజను కూడా లాగింది. సాయి కంటే పొడుగ్గా వ్యక్తిని మాత్రమే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది. సాయి ధరమ్ తేజ అంత హైట్ ఉంటే తనకు సరిపోదని చెప్పుకొచ్చింది.
అయితే సేమ్ టైం.. సాయిని పొగడ్తలతో ముంచెత్తింది. సాయికి వాళ్ల అమ్మంటే చాలా ఇష్టమని.. .అమ్మను ప్రేమించేవాడు భార్యను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడని కితాబిచ్చింది. సాయి లాంటి భర్త దొరకడం ఏ అమ్మాయికైనా అదృష్టమేనని అంటోంది. కానీ తనకు మాత్రం సాయి వద్దని ఇండైరెక్ట్ గా చెబుతోంది రాశిఖన్నా.
Tags:    
Advertisement

Similar News