వాళ్ల చావు ఖ‌రీదు 100 కోట్లు..!

కొన్ని సినిమాల విడుద‌ల‌కు ముందు అష్ట క‌ష్టాలు ప‌డ‌తాయి. ఎందుకంటే స్టార్ బ‌జ్ లేని  సినిమాలు  కొన‌డానికి  ఎవ‌రు ముందుకు రారు. ఇది కేవ‌లం తెలుగులోనే కాదు. స‌ర్వ‌త్ర ఇదే స‌మ‌స్య. అయితే  మ‌రాఠిలో  ఇటువంటి స‌మ‌స్య‌లు  పేస్ చేసి  ఇద్ద‌రు కొత్త వాళ్ల‌తో చేసిన సైర‌త్ అనే చిత్రం సంచ‌ల‌న విజ‌యం వైపుగా దూసుకెళ్తుంది.  కుల గౌర‌వం పేరుతో  హ‌త్య‌లు చేయ‌డం  ఈ మ‌ధ్య మ‌న‌దేశంలో బాగా పెరిగింది.   ఈ చిత్రంలో  ద‌ర్శ‌కుడు  సృసించిన అంశం […]

Advertisement
Update:2016-06-03 04:47 IST

కొన్ని సినిమాల విడుద‌ల‌కు ముందు అష్ట క‌ష్టాలు ప‌డ‌తాయి. ఎందుకంటే స్టార్ బ‌జ్ లేని సినిమాలు కొన‌డానికి ఎవ‌రు ముందుకు రారు. ఇది కేవ‌లం తెలుగులోనే కాదు. స‌ర్వ‌త్ర ఇదే స‌మ‌స్య. అయితే మ‌రాఠిలో ఇటువంటి స‌మ‌స్య‌లు పేస్ చేసి ఇద్ద‌రు కొత్త వాళ్ల‌తో చేసిన సైర‌త్ అనే చిత్రం సంచ‌ల‌న విజ‌యం వైపుగా దూసుకెళ్తుంది.

కుల గౌర‌వం పేరుతో హ‌త్య‌లు చేయ‌డం ఈ మ‌ధ్య మ‌న‌దేశంలో బాగా పెరిగింది. ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు సృసించిన అంశం ఇదే. ఒక గ్రామంలో సామాజికంగా అగ్ర వ‌ర్ణ‌నానికి చెందిన అమ్మాయిని.. దిగువ వ‌ర్ణాంగ ప‌రిగ‌ణించే కులానికి చెందిన అబ్బాయి ప్రేమిస్తాడు. దీంతో సామాజికంగా ఆ గ్రామం రెండు వ‌ర్గాలుగా చీలిపోతుంది. చివ‌ర‌కు ప్రేమ జంటను అమ్మాయి త‌రుపు వాళ్లు చంపేస్తారు. వీళ్ల సంతానం అయిన 4 ఏళ్ల పిల్లాడు త‌ల్లి దండ్రుల శవాల ద‌గ్గ‌ర అమ‌యాకంగా చూస్తుంటాడు. ఇది క్లైమాక్స్. గుండేను పిండేసే క్లైమాక్స్. అంద‌ర్నీ ఏడిపించే క్లేమాక్స్. అందుకే 4 కోట్ల‌తో అష్ట క‌ష్టాలు ప‌డి ఎట్ట‌కేల‌కు విడుద‌లైన మ‌రాఠి చిత్రం సైర‌త్ మ‌హారాష్ట్రలో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఇప్ప‌టికే 100 కోట్ల‌కు చేరువైంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. క‌థ‌లో విష‌యం వుండి..అది ప్రేక్ష‌కుల గుండెను ట‌చ్ చేస్తే ఒక చిన్న చిత్ర‌మైన ఏ విధ‌మైన విజ‌యం సాధిస్తుంది అని చెప్ప‌డానికి సైర‌త్ ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు విమ‌ర్శ‌కులు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి మ‌రి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News