కేసీఆర్ కు పిచ్చిపట్టింది: రేవంత్
పుట్టుకతో వచ్చిన బుద్దులు పుల్లలతోగానీ పోవంటారు.. కొందరంతే ఏం జరిగినా.. ఎవ్వరేమనుకున్నా.. వాళ్ల తీరు మార్చుకోరు.. మచ్చలేని వ్యక్తిత్వం ఉన్నవారికైతేఈ ధోరణి మేలే చేస్తుంది. కానీ, తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు చిక్కిన వ్యక్తులు కూడా ఇలాగే ముందుకెళితే భంగపాటు తప్పదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారం సరిగ్గా ఇలాగే ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉనికి కోసం ఆరాటపడుతున్న ఆ పార్టీకి రేవంత్ వ్యాఖ్యలు మరింత […]
Advertisement
పుట్టుకతో వచ్చిన బుద్దులు పుల్లలతోగానీ పోవంటారు.. కొందరంతే ఏం జరిగినా.. ఎవ్వరేమనుకున్నా.. వాళ్ల తీరు మార్చుకోరు.. మచ్చలేని వ్యక్తిత్వం ఉన్నవారికైతేఈ ధోరణి మేలే చేస్తుంది. కానీ, తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు చిక్కిన వ్యక్తులు కూడా ఇలాగే ముందుకెళితే భంగపాటు తప్పదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారం సరిగ్గా ఇలాగే ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉనికి కోసం ఆరాటపడుతున్న ఆ పార్టీకి రేవంత్ వ్యాఖ్యలు మరింత చేటు తెస్తున్నాయని అంటున్నారు మేధావులు. మైకు దొరికితే కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్ మరోసారి సీఎంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు పిచ్చి పట్టుకుందని, ఆయనకు పట్టిన పిచ్చి వదలాలంటే.. వేపాకులతో కొట్టాలని కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రసంగించారు.
పిచ్చి ఎవరికి పట్టిందో తెలుసు..
రేవంత్ వ్యాఖ్యలపై గులాబీదండు మండిపడుతోంది. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశానికి రాసే మీడియా ఉంది కదా! అని పిచ్చిమాటలు మాట్లాడితే.. ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికినా బుద్ధిరాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. చర్లపల్లి జైలులో చిప్పకూడు తిన్నాక కూడా రేవంత్ తీరు మారకపోవడం ఆయన ఉన్మాదానికి నిదర్శనం అని మండిపడుతున్నారు. త్వరలో ఓటుకు నోటు కేసులో జైలుకు వెళితే.. తనకు రాజకీయ జీవితం ఉండదని తెలిసే.. రేవంత్ కే పిచ్చి పట్టిందని, అందుకే.. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
Advertisement