కేటీఆర్ వెల్లడించే వార్త అదేనా?
మంత్రి కేటీఆర్ గురువారం ఓ ఆసక్తికర విషయం చెబుతానని అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో తెలుగు మీడియాలో ఉత్కంఠ నెలకొంది. అసలు ఇంతకీ ఆ విషయం ఏమై ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. గురువారం రోజు ఆయన ఏం చెప్పబోతున్నారన్న విషయంపై ఇప్పటికే ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. అది రాజకీయమా? లేక ఆయన శాఖలకు సంబంధించినదా? లేదా వ్యక్తిగతమా? అన్నది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే, అది తప్పకుండా రాష్ట్ర […]
Advertisement
మంత్రి కేటీఆర్ గురువారం ఓ ఆసక్తికర విషయం చెబుతానని అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో తెలుగు మీడియాలో ఉత్కంఠ నెలకొంది. అసలు ఇంతకీ ఆ విషయం ఏమై ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. గురువారం రోజు ఆయన ఏం చెప్పబోతున్నారన్న విషయంపై ఇప్పటికే ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. అది రాజకీయమా? లేక ఆయన శాఖలకు సంబంధించినదా? లేదా వ్యక్తిగతమా? అన్నది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే, అది తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసే అంశమే అయి ఉంటుందని, అందుకే ఆయన అలా ట్వీట్ చేసి ఉంటారని మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు..
ఆ రెండింటిలో ఏదో ఒకటి..!
గురువారం తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అందులో మొదటిది పాలేరు ఉప ఎన్నిక ఫలితం. రెండోది ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ హైదరాబాద్ పర్యటన. టిమ్ కుక్ హైదరాబాద్ వస్తే.. ఏమవుతుంది? అనేనా మీ ప్రశ్న.. అసలు విషయం ఏంటంటే..? గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ తో ఆపిల్ సీఈఓ టిమ్‌కుక్ భేటీ కానున్నారు. నానక్ రాంగూడలోని వేవ్ రాక్ బిల్డింగ్ లో జరిగే కార్యక్రమంలో యాపిల్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. యాపిల్ అభివృద్ధి కేంద్రాన్ని టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. నిజంగా ఈ వార్త కార్యరూపం దాలిస్తే… హైదరాబాద్‌కు మరిన్ని విదేశీ కంపెనీలు క్యూ కడతాయి. పెట్టుబడులకు అనుకూల నగరంగా మరింత పేరు వస్తుంది. తాను ఐటీ పగ్గాలు చేపట్టాక కార్యరూపం దాలుస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కావడంతో కేటీఆర్ చాలా ఉత్కంఠతో ఉన్నారని సమాచారం. అందుకే, ఈ ఉత్కంఠను అందరికీ పంచాలని అలా ట్వీట్ చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. టిమ్ కుక్ హైదరాబాద్ పర్యటనతో పోలిస్తే… పాలేరు ఉప ఎన్నిక చాలా చిన్న విషయమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.
Advertisement