నమస్తే తెలంగాణపై దిగ్విజయ్ విసుర్లు!
కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఆ పత్రిక రాసే వార్తలని పట్టించుకోవద్దని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. పనిలోపనిగా కేసీఆర్ చానల్ టీ న్యూస్‌పైనా ఆయన అక్కసు వెళ్లగక్కారు. కేవలం ఒకే ఒక పార్టీకి ఈ రెండు మీడియాలు మౌత్ పీస్‌లుగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇవి రాసే కథనాలను, వార్తలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని తేల్చి చెప్పారు. ఇంతకీ ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చిందనేగా […]
Advertisement
కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఆ పత్రిక రాసే వార్తలని పట్టించుకోవద్దని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. పనిలోపనిగా కేసీఆర్ చానల్ టీ న్యూస్‌పైనా ఆయన అక్కసు వెళ్లగక్కారు. కేవలం ఒకే ఒక పార్టీకి ఈ రెండు మీడియాలు మౌత్ పీస్‌లుగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇవి రాసే కథనాలను, వార్తలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని తేల్చి చెప్పారు. ఇంతకీ ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చిందనేగా మీ అనుమానం.. అయితే.. ఈ వార్త మొత్తం చదవాల్సిందే!
టీ మీడియాపై కార్యకర్తల ఆందోళన!
తెలంగాణలో కేసీఆర్ పత్రిక, టీవీ చానళ్లకు నెమ్మదిగా ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2 పార్లమెంటు, 2 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇంకా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఇతర చిన్న మునిసిపాలిటీల ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దాదాపు మట్టి కరిచినంత పనైంది. తాజాగా జరిగిన సమావేశంలో పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ సరళిపైనా చర్చ జరిగినట్లు సమాచారం. తాము పాల్గొంటున్న ప్రతీ ఎన్నికల్లోనూ నమస్తే తెలంగాణ, టీ న్యూస్ రెండూ కాంగ్రెస్ పార్టీపై చేస్తోన్న వ్యతిరేక ప్రచారంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఓటిమికి ప్రజల్లో సెంటిమెంటుకు తోడు, విద్యావంతులు, ఉద్యోగులలో తమకు వ్యతిరేకంగా టీమీడియా చేస్తోన్న ప్రచారమే కారణమని వారంతా దిగ్విజయ్ ముందు వాపోయినట్లు తెలిసింది. అయితే, టీమీడియాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. 2004లోనూ ఇలాంటి పరిస్థితే ఉండేదని, మరి అప్పుడు మనం గెలిచాం కదా? అని కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపినట్లు సమాచారం.
Advertisement