గుత్తా కామెంట్స్.. ఇరుకున పడ్డ టీఆర్ ఎస్

తెలంగాణలో ఏకైక ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ టీఆర్ ఎస్‌ను అవ‌కాశ‌మున్న‌ప్పుడ‌ల్లా ఇరుకున పెడుతోంది. పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారం సంద‌ర్భంగా శ్రీకాంతాచారి త‌ల్లికి సిరిసిల్ల టికెట్ ఎందుకు ఇవ్వ‌లేదు? అని వేసిన ఉత్త‌మ్ ప్ర‌శ్న‌కు టీఆర్ ఎస్ దీటుగానే బుదులిచ్చినా.. అది కొత్త చ‌ర్చ‌కు మాత్రం దారి తీసింది. అమ‌రుల కుటుంబాల‌కు బ‌లం లేని చోట టికెట్ ఎందుకిచ్చిన‌ట్లు అన్న చ‌ర్చ మొద‌లైంది. తాజాగా కాంగ్రెస్ సంధించిన మ‌రో ఆరోప‌ణాస్ర్తం అధికార టీఆర్ ఎస్‌ను మ‌రోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. […]

Advertisement
Update:2016-05-15 04:21 IST

తెలంగాణలో ఏకైక ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ టీఆర్ ఎస్‌ను అవ‌కాశ‌మున్న‌ప్పుడ‌ల్లా ఇరుకున పెడుతోంది. పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారం సంద‌ర్భంగా శ్రీకాంతాచారి త‌ల్లికి సిరిసిల్ల టికెట్ ఎందుకు ఇవ్వ‌లేదు? అని వేసిన ఉత్త‌మ్ ప్ర‌శ్న‌కు టీఆర్ ఎస్ దీటుగానే బుదులిచ్చినా.. అది కొత్త చ‌ర్చ‌కు మాత్రం దారి తీసింది. అమ‌రుల కుటుంబాల‌కు బ‌లం లేని చోట టికెట్ ఎందుకిచ్చిన‌ట్లు అన్న చ‌ర్చ మొద‌లైంది. తాజాగా కాంగ్రెస్ సంధించిన మ‌రో ఆరోప‌ణాస్ర్తం అధికార టీఆర్ ఎస్‌ను మ‌రోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. రాజ్య‌స‌భకు శ్రీ‌కాంతాచారి త‌ల్లిని ఎందుకు పంప‌డం లేదు? ఇది సీఎం కేసీఆర్ కు న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి వేసిన సూటి ప్ర‌శ్న‌. గుత్తా వాద‌న‌లోనూ న్యాయ‌ముంద‌ని ప‌లువురు స‌మ‌ర్ధిస్తున్నారు. ఇత‌ర పార్టీల నుంచి తెచ్చుకున్న నాయ‌కుల‌కు కీల‌క ప‌దవులు, రాజ‌కీయ స‌భ్య‌త్వాలు క‌ట్ట‌బెట్టే బ‌దులుగా అమ‌రుల కుటుంబాల‌కు ఎంపీ స్థానం ఇస్తే త‌ప్పేంటి? అన్న ఆలోచ‌న ప‌లువురిలో రేకెత్తించారు గుత్తా.

తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కంటే పార్టీ బ‌లోపేతంపై కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న కాంగ్రెస్ వాద‌న‌లోనూ నిజ‌ముంద‌ని తెలంగాణ‌వాదులు సైతం అంగీక‌రిస్తున్నారు. అమ‌రుల కుటుంబాల‌కు తెలంగాణ ప్రభుత్వం ప‌రిహారం ఇచ్చింది. కానీ, రాజ‌కీయంగా వారికి త‌గిన ప్రాధాన్యం ఇవ్వాల‌న్న డిమాండ్ మాత్రం ఇంకా అలాగే మిగిలిపోవ‌డం బాధాక‌రం. తెలంగాణ పోరులో ఆత్మ‌బ‌లిదానం చేసిన ప‌లువురి కుటుంబాలు త‌మ‌కు రాజ‌కీయంగా న్యాయం చేయాల‌ని కేసీఆర్ కు విన్నవించాయి. వీరిలో శ్రీకాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌కు రాష్ర్ట వ్యాప్తంగా సానుభూతి ల‌భించింది. మ‌లిద‌శ పోరుకు త‌న ఆత్మార్ప‌ణంతో ఊపిరిపోసిన శ్రీ‌కాంతాచారి త్యాగానికి ఇప్ప‌టికైనా న్యాయం చేయాల‌న్న కాంగ్రెస్ వాదుల డిమాండ్ స‌హేతుక‌మైన‌దేన‌న్న అభిప్రాయం బ‌య‌ల్దేరింది. అదే స‌మ‌యంలో గులాబీ నేత‌లు మీ డిమాండ్ స‌రైందే.. కానీ అదే శ్రీకాంతాచారి త‌ల్లి పై టీపీసీసీ చీఫ్ పోటీ చేసిన‌పుడు ఈ విష‌యాలు ఎందుకు గుర్తుకు రాలేదు? అని ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో వంద‌లాది మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే.. స్పందించ‌ని కాంగ్రెస్ నేత‌ల‌కు.. అధికారం కోల్పోయాక అమ‌రుల సంక్షేమం గుర్తుకువ‌చ్చిందా? అని గులాబీదండు నేత‌లు నిల‌దీస్తున్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News